
Breaking: బిగ్ బ్రేకింగ్ టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు గుండెపోటుతో మృతి..!!
Big Breaking Tollywood Senior Actor Chalapathi Rao Dies Of Heart Attack

ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీకి అసలు కలిసి రాలేదు.చాలామంది ప్రముఖ నటులు ఈ లోకం విడిచి వెళ్లిపోయారు.
సెప్టెంబర్ నెలలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, నవంబర్ నెలలో సూపర్ స్టార్ కృష్ణ మరణించడం జరిగింది.ఈనెల 23వ తారీకు నవరస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ మరణించారు.
కాగా ఈరోజు సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూశారు.గుండెపోటుతో ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.1200కి పైగా సినిమాల్లో నటించిన చలపతిరావు… ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేయడం జరిగింది. కెరియర్ ప్రారంభంలో విలన్ పాత్రలో అధిక సినిమాలు చేయడం జరిగింది.
ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా. రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు.
ఆయన కుమారుడు రవిబాబు దర్శకుడిగా మరియు నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. దీంతో చలపతిరావు మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.చాలామంది ప్రముఖ సీనియర్ నటులు సినీ ఇండస్ట్రీ పెద్దలు చలపతిరావు మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.