EventEvents/PressmeetsMOVIE NEWSSpecial Bites

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ వీరసింహారెడ్డి థర్డ్ సింగిల్ ‘మా బావ మనోభావాలు’ అశేష బాలయ్య అభిమానుల చేతుల మీదుగా గ్రాండ్ గా విడుదల

Nandamuri Balakrishna, Gopichand Malineni, Maithri movie makers Veerasimha Reddy's third single 'Ma Bava Manobhavalu' released grandly at the hands of Ashesha Balayya's fans.

– సమరసింహారెడ్డి, నరసింహానాయుడు రెండూ కలిపితే ఎలా వుంటుందో.. అదే వీరసింహారెడ్డి : సాంగ్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’ జనవరి 12, 2023న సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.  టాప్ ఫామ్లో ఉన్న ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్  సింగిల్ జై బాలయ్య, సెకండ్ సింగిల్ సుగుణ సుందరి స్మాషింగ్ హిట్స్ గా నిలిచాయి. 

ఇప్పుడు ‘ది సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ‘మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి ‘పాటతో వచ్చారు  మేకర్స్. ఇలాంటి పాటలను మంచి అనుభవం కోసం పెద్ద స్క్రీన్ పై చూడాలి. అందుకే  పాటను సంధ్య 35 MM లో గ్రాండ్ గా లాంచ్ చేసారు మేకర్స్. భారీగా హాజరైన అభిమానుల తోనే పాటని గ్రాండ్ గా విడుదల చేయించింది చిత్ర యూనిట్.

థమన్ తన ట్రేడ్ మార్క్ బీట్ లతో పాటని లైవ్లీ గా స్కోర్ చేశాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కంపోజిషన్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. పాటను విజువల్ గా చూసినప్పుడు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. సాహితీ చాగంటి, యామిని, రేణు కుమార్ లు అద్భుతంగా అలపించారు. ఇక బాలకృష్ణ, చంద్రిక రవి తమ సూపర్ ఎనర్జిటిక్ డ్యాన్స్లతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా బాలకృష్ణ మాస్ డ్యాన్స్ మూవ్స్ తో మెస్మరైజ్ చేశారు. వైబ్రెంట్ సెట్స్ లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో చిత్రీకరించిన పాట కన్నుల పండగలా వుంది. మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేని మాస్ తో పాటు క్లాస్ లను మెప్పించే అంశాలను చేర్చారు.

సాంగ్ లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. జనవరి 12 నుండి థియేటర్ లో జై బాలయ్య అనే నినాదం మ్రోగుతూనే వుంటుంది. ఇప్పుడు చూసిన సాంగ్ జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇందులో ఒక సిగరెట్ స్టెప్ , సోడా స్టెప్ వుంటుంది. మాములుగా వుండదు. ఇప్పుడు అన్నపూర్ణలో జరుగుతున్న సాంగ్ కూడా మాములుగా వుండదు. ఫ్యాన్స్ కి పండగే. ఒక సమరసింహా రెడ్డి, నరసింహానాయుడు వైబ్రేషన్ ఎలా వుంటుందో వీరసింహారెడ్డి అలా వుంటుంది. థియేటర్ లో ఎవరూ సీట్లలో కూర్చోరు. భీవత్సంగా వుంటుంది. జనవరి 12న వస్తున్నాం. రెడీగా వుండండి తమ్ముళ్ళు” అన్నారు.

నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. కర్నూల్ లో జరిగిన  వీరసింహారెడ్డి టైటిల్ లాంచ్ ఈవెంట్ లో ఈ చిత్రం సమరసింహారెడ్డి లా ఉంటుందని చెప్పాం. అప్పటికి ఇంకా ముఫ్ఫై రోజుల షూటింగ్ మిగిలుంది. ఇప్పుడు షూటింగ్ పూర్తయిన తర్వాత చెప్పేది ఏమిటంటే.. సమరసింహా రెడ్డి, నరసింహానాయుడు రెండు కలిపితే ఎలా వుంటుందో అదే వీరసింహారెడ్డి” అన్నారు

డీవోపీ రిషి పంజాబీ మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుండి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ కు కృతజ్ఞతలు, జై బాలయ్య” అన్నారు.

ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి  రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్లో చిత్రీకరిస్తున్న చివరి పాట మినహా సినిమా షూటింగ్ పూర్తయింది.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.

సాంకేతిక విభాగం

కథ, స్క్రీన్ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్

సంగీతం: థమన్

డివోపీ: రిషి పంజాబీ

ఎడిటర్: నవీన్ నూలి

ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్

డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా

ఫైట్స్: రామ్-లక్ష్మణ్

సిఈవో: చిరంజీవి (చెర్రీ)

కో-డైరెక్టర్: కుర్రా రంగారావు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి

లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి

పబ్లిసిటీ: బాబా సాయి కుమార్

మార్కెటింగ్: ఫస్ట్ షో

పీఆర్వో: వంశీ-శేఖర్

Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close