
ఒకే డైరెక్టర్ తో ఐదు నిర్మాణసంస్థలు ఐదు వేర్వేరు చిత్రాలు ఒకే రోజు ప్రారంభం
Five production houses with the same director and five different films are launching on the same day

నందికొండ వాగుల్లోన , మోని , స్టూవర్టుపురం , ఇన్ సెక్యూర్ చిత్రాల దర్శకుడు సత్యనారాయణ ఏకరీ తో ఐదు నిర్మాణసంస్థలు ఐదు వేర్వేరు చిత్రాలను ఒకే రోజు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పూజా కార్యక్రమాలతో లక్కీ ఏకరీ నిర్మాతగా ఆర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 5 , క్రాంతి కిరణ్ నిర్మాతగా శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 , రంజిత్ కోడిప్యాక నిర్మాతగా వాసవి మాత ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1, భాస్కర్ బస్వగాని ప్రొడ్యూసర్ గా ఆర్య ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1,మరియు రవికుమార్ చౌదరి కసుకుర్తి నిర్మాత గా తేజస్వినిసాయి ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 , ఐదు చిత్రాలను ప్రారంభించారు
ఈ సందర్భంగా దర్శకుడు సత్యనారాయణ ఏకరీ మాట్లాడుతూ… ఈ ఐదు చిత్రాలు డిఫరెంట్ జోనర్లలో ఉంటాయి, మొదటగా ” ఫ్రమ్ నార్త్ ” అనే మూవీ జనవరి 2 నుండి మొదటి షెడ్యూల్ కాశ్మీర్ లో 13 రోజులు పాటు షూటింగ్ చేయనున్నాం, త్వరలోనే అన్ని చిత్రాల షూటింగ్ పూర్తిచేసి 2023 వేసవిలో అన్ని సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నాం, నటీనటులు మరియు సాంకేతిక నిపుణులను త్వరలో ప్రకటిస్తామన్నారు.
—
RK.Chowdary PRO 9848623335