MOVIE NEWS
Trending

సిడ్ శ్రీరామ్‌, గొపి సుంద‌ర్‌, జిఏ2 పిక్చ‌ర్స్ మ్యూజిక‌ల్ మ్యాజిక్ ని రిపీట్ చేసిన‌ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్” ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఆడియో ఆల్బమ్ నుంచి మొద‌టి పాట‌ను విడుద‌ల చేశారు. గీత గొవిందం లాంటి బ్లాక్‌బస్ట‌ర్ చిత్రం లో ఇంకేం… ఇంకేం…. ఇంకేం…కావాలి…. అనే సెన్సేష‌న‌ల్ సాంగ్ ని అందించిన మ్యూజిక‌ల్ కాంబోని మళ్ళీ ఈ చిత్రం ద్వారా రిపీట్ చేశారు. “మ‌న‌సా…. మ‌నసా… మ‌న‌సారా… బ్ర‌తిమాలా… త‌న‌వ‌క‌వడిలో ప‌డ‌బొకే మ‌న‌సా అంటూ సాగే ఈ సాంగ్ ప్ర‌స్తుతం సెన్సేష‌న్ గా ట్రెండ్ అవ్వడం విశేషం. ఇక బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ డైరెక్ష‌న్ స్కిల్స్ తో పాటు…. ఇండ‌స్ట్రీకి వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్ని అందిస్తున్న ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా పేరు సంపాదించిన జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకం పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ చిత్రాన్ని మెస్ట్ ఇంటిలిజెంట్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నివాసు, వాసువ‌ర్మ తో క‌లిసి నిర్మిస్తున్నారు.

మ‌న‌సా మ‌న‌సా అంటూ మ‌న‌సులు దోచుకున్న సిడ్ శ్రీరామ్, గొపిసుంద‌ర్

జీఏ 2 బ్యాన‌ర్ నుంచి గ‌తంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ గీత‌గోవిందం ఆడియో ఒక సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. మ్యూజిక‌ల్ హిట్స్ కొంత గ్యాప్ వ‌చ్చిన స‌మ‌యంలో ఈ చిత్రం మ్యాజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌టం విశేషం. మళ్ళి అదే కాంబినేష‌న్ లో వస్తున్న ఈసినిమా ఆడియో కూడా అదే రేంజి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం అంద‌రిలో వుంది. గోపీసుంద‌ర్ కంపోజ్ చేసిన ఈ ఆల్బ‌మ్ లో సిడ్ శ్రీరామ్ పాడిన‌ ఈ పాట మ‌నసు దోచుకుంది. ఈపాట‌ని ఎన్నో మంచి పాట‌ల‌కి సాహిత్యాన్ని అందించిన సురేంద‌ర్ కృష్ణ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించారు.

లిరిక్స్‌..

ప‌ల్ల‌వి..
మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్ర‌తిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకమ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావే మ‌న‌సా
నా మాట అలుసా నేనెవ‌రో తెలుసా నాతోనే వుంటావు న‌న్నే న‌డిపిస్తావు న‌న్నాడిపిస్తావే మ‌న‌సా..

చ‌ర‌ణం1..

ఏముంది త‌న‌లోని గ‌మ్మ‌త్తు అంటే
అది దాటి మ‌త్తేదే ఉందంటూ అంటూ
త‌న‌క‌న్నా అందాలు వున్నాయి అంటే
అందానికే తాను ఆకాశ‌మంటూ
నువ్వే నా మాట విన‌కుంటే మ‌న‌సా..తానే నీ మాట వింటుందా ఆశ‌
నేనెవ‌రో తెలుసా నామాట అలుసా..నా తోనే వుంటావు న‌న్నే న‌డిపిస్తావు నన్నాడిపిస్తావే మ‌న‌సా.

చ‌ర‌ణం2

తెలివంత నా సొంత‌మంటూ తిరిగా
త‌న‌ముందు నుంచుంటే నా పేరు మ‌రిచా
ఆ మాట‌లే వింటూ మ‌తిపోయి నిలిచా
బ‌దులెక్క‌లుంద‌టూ ప్ర‌తి చోట వెతికా
త‌న‌తో వుండే ప్ర‌తిఓక్క నిమిషం మ‌ర‌ల మ‌ర‌ల పుడ‌తావా మ‌న‌సా
నా మాట అలుసా నేన‌వ‌రో తెలుసా నాతోనే వుంటావు న‌న్నే న‌డిపిస్తావు న‌న్నాడిపిస్తావే మ‌న‌సా

న‌టీ న‌టులు

అఖిల్ అక్కినేని
పూజా హెగ్ఢే
ఆమ‌ని
ముర‌ళి శ‌ర్మ‌
జ‌య ప్ర‌కాశ్
ప్ర‌గ‌తి
సుడిగాలి సుధీర్
గెటెప్ శ్రీను
అభ‌య్
అమిత్

టెక్నీష‌య‌న్స్

డైరెక్ట‌ర్ : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ
ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్
ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా
నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్
బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్

………………………………………………………..
Sid Sriram, GA 2 Pictures and Gopi Sunder repeat the magic for ‘Most Eligible Bachelor’ first single

Starring Akhil Akkineni in the lead role and bankrolled by GA 2 Pictures, ‘Most Eligible Bachelor’ is gearing up for its release. The makers have released the first song from the audio album today. Gopi Sunder, who previously gave a chart-buster song, ‘Inkem Inkem Kavale’ for Geetha Govindam has worked his magic this time around as well. ‘Manasa Manasa’ is on course to become a chart-buster song, thanks to its soothing tune. Bommarillu Bhaskar and in-form production house GA 2 Pictures are joining hands for ‘Most Eligible Bachelor’.

Sid Sriram and Gopi Sunder repeat the magic for ‘Most Eligible Bachelor’ first single.

Geetha Govindam, which was bankrolled by GA 2 Pictures banner was a musical blockbuster and the same combo is working again for Akhil Akkineni’s ‘Most Eligible Bachelor’. Sid Sriram’s magical voice and Gopi Sundar’s mesmerizing composition have worked pretty well for this song. Surender Krishna penned the lyrics for this song.

Cast:

Akhil Akkineni
Pooja Hegde
Amani
Murali Sharma
Jaya Prakash
Pragathi
Sudigali Sudheer
Getup Sreenu
Abhay
Amith

Technicians:

Director: Bommarillu Bhaskar
Music: Gopi Sunder
Cinematographer: Pradeeep M Sharma
Editor: Marthand K Venkatesh
Art director: Avinash Kolla
Producers: Bunny Vas, and Vasu Varma
Presented by: Allu Aravind
Banner: GA 2 Pictures

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close