
17న విడుదలకానున్న నిఖిల్, అనుపమ జంటగా నటించిన “18 పేజెస్” ట్రైలర్
The trailer of "18 Pages" starring Nikhil and Anupama will release on 17th

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ “18పేజిస్” ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవలే ఈ “18పేజిస్” టీజర్ కి, “నన్నయ్య రాసిన” అలానే “టైం ఇవ్వు పిల్ల” అనే పాటలతో పాటు రీసెంట్ గా రిలీజైన “ఏడు రంగుల వాన” అనే పాటకు కూడా అనూహ్య స్పందన లభించింది. ఈ చిత్ర ప్రొమోషనల్ కంటెంట్ సినిమాపై రోజురోజుకు ఆసక్తిని పెంచుతుంది. ఈ తరుణంలో ఈ చిత్ర యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను 17 వ తారీఖున రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.
ప్రొమోషన్స్ లో భాగంగా ఒక క్రేజి వీడియోతో ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు అనుపమ & నిఖిల్.
—
Thanks & Regards,
Eluru Sreenu
P.R.O