
సిజు విల్సన్, కాయాదు లోహర్, వినయన్, సిహెచ్. సుధాకర్ బాబు, ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్, యాక్షన్ పీరియడ్ డ్రామా ‘పులి’ ఫస్ట్ లుక్ విడుదల
Siju Wilson, Kayadu Lohar, Vinayan, Ch. Sudhakar Babu, All India Entertainment, action period drama 'Puli' first look release

సిజు విల్సన్ ప్రధాన పాత్రలో కాయాదు లోహర్ కథానాయికగా తెరకెక్కిన మలయాళం యాక్షన్ పీరియడ్ డ్రామా ‘పాథోన్పథం నూట్టండు’. వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హక్కుల కోసం ఎంతో మంది పోటీపడగా ‘అమ్మదొంగ’ లాంటి సూపర్ హిట్ చిత్రాలని నిర్మించిన ప్రముఖ సీనియర్ నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు.
ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ‘పులి’ అనే టైటిల్ తో తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘The 19th century’ అన్నది ఉపశీర్షిక. తాజాగా ఈ చిత్రానికి సంబధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో కదనరంగంలో ఖడ్గవీరుడిగా కనిపించారు సిజు విల్సన్.
తెలుగు రైట్స్ దక్కించున్న నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు మాట్లాడుతూ.. ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. త్వరలో ఈ చిత్రాన్ని తెలుగులో చాలా గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. మంచి కథ, కథనంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రమిది. తెలుగు ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం వుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని తెలియజేస్తాం”అన్నారు.
ఎస్.కె రామచంద్రనాయక్ సహా నిర్మాత వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో అనూప్ మీనన్, పూనమ్ బజ్వా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఎం. జయచంద్రన్ సంగీతం అందించగా, సంతోష్ నారాయణన్ నేపధ్య సంగీతం సమకూర్చారు. వివేక్ హర్షన్ ఎడిటర్ గా, అజయ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా, మాఫియా శశి, కె. రాజశేఖర్, ఎస్.జి. సోమసుందరం ఫైట్ మాస్టర్స్ గా పని చేశారు.
తారాగణం: సిజు విల్సన్, కాయాదు లోహర్, అనూప్ మీనన్, పూనమ్ బజ్వా తదితరులు
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం : వినయన్
తెలుగు నిర్మాత: సిహెచ్. సుధాకర్ బాబు
సహ నిర్మాత : ఎస్.కె రామచంద్రనాయక్
బ్యానర్ : ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్
సంగీతం: ఎం. జయచంద్రన్
నేపధ్య సంగీతం : సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: షాజీ కుమార్
ఎడిటర్ : వివేక్ హర్షన్
ఆర్ట్ డైరెక్టర్ : అజయ్ కుమార్
ఫైట్స్ : మాఫియా శశి, కె. రాజశేఖర్, ఎస్.జి. సోమసుందరం
పీఆర్వో : వంశీ-శేఖర్
Pro: Vamsi – Shekar