
ధనుష్,అరుణ్ మాథేశ్వరన్, టి.జి. త్యాగరాజన్,సత్యజ్యోతి ఫిల్మ్స్ ‘కెప్టెన్ మిల్లర్’ లో కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్ కుమార్
Dhanush, Arun Matheswaran, T.G. Kannada Superstar Siva Rajkumar in Thyagarajan and Sathya Jyoti Films' 'Captain Miller'

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ మూవీ “కెప్టెన్ మిల్లర్”. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టి జి త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సహ నిర్మాతలు.
భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ప్రామెసింగ్ హీరో సందీప్ కిషన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో.. తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ చేశారు. కెప్టెన్ మిల్లర్ లో శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రకటిస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ ని విడుదల చేశారు.
ఈ చిత్రంలో ధనుష్ కి జోడిగా ఇద్దరు కథానాయికలు ప్రియాంక మోహన్, నివేదిత సతీష్ నటిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.
కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
తారాగణం: ధనుష్, శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక మోహన్, నివేదిత సతీష్
సాంకేతిక విభాగం :
రచయిత, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్
నిర్మాతలు: జి. శరవణన్ , సాయి సిద్ధార్థ్
సమర్పణ: టీజీ త్యాగరాజన్
బ్యానర్: సత్యజ్యోతి ఫిల్మ్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: శ్రేయాస్ కృష్ణ
ఎడిటర్: నాగూరన్
ఆర్ట్: టి.రామలింగం
పీఆర్వో: వంశీ-శేఖర్
Pro: Vamsi – Shekar