EventEvents/PressmeetsMOVIE NEWSSpecial Bites

డిసెంబ‌ర్ 9న రిలీజ్ అవుతున్న ‘పంచ‌తంత్రం’ వంటి కంటెంట్ రిచ్ ఫిలింస్ గురించి ప‌ది మందికి చెప్పాలి. ప‌ది మంది గొప్ప‌గా మాట్లాడాలి – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌

A content-rich film like 'Panchathantram' should be watched by all: Harish Shankar

డా.బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న యాంథాల‌జీ ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్ వ‌ర్ద‌న్‌, సృజ‌న్ ఎర‌బోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డిసెంబ‌ర్ 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ప్ర‌శాంత్ ఆర్‌.విహారి, శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా…

ద‌ర్శ‌కుడు ఎస్‌.హ‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ ‘‘నాకు టికెట్ ఫ్యాక్టరీకి ఏదో తెలియ‌ని అనుబంధం ఉంది. అఖిలేష్‌, భువ‌న్‌తో మంచి అనుబంధం ఉంది. భువ‌న్ నా సోష‌ల్ మీడియా పి.ఆర్ అంతా చూసేవాడు. త‌ను ఈ సిమాన‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా చేయ‌టం మంచి ప‌రిణామం. ఓ రైట‌ర్‌గా నాకు సెట్స్‌లో అంద‌రూ తెలుగువాళ్లే ఉండాల‌నిపిస్తుంది. ఫ‌స్ట్ టేక్‌కి, సెకండ్ టేక్‌కి ఒక్కోసారి నేను డైలాగ్ మార్చేస్తుంటాను. అప్పుడు ప్రిపేర్ కావాలంటూ ముంబై హీరోయిన్స్ ప‌క్క‌కి వెళితే నాకు ఇరిటేటింగ్‌గా ఉంటుంది. అందుకే తెలుగు హీరోయిన్స్ ఉండాల‌నే కోరుకుంటాను. అయితే కొన్ని మార్కెట్ ఈక్వెష‌న్స్ బ్యాలెన్స్  చేయాల్సి ఉంటుంది. పంచతంత్రం విష‌యానికి వ‌స్తే అంద‌రూ దీన్ని చిన్న సినిమా అంటున్నారు. కానీ… ఇందులో చాలా రిచ్ కంటెంట్ ఉంది. కాబ‌ట్టి దీన్నెవ‌రూ చిన్న సినిమా అని అన‌కండి. మూవీ రిలీజ్ త‌ర్వాత తెలుస్తుంది. డైరెక్ట‌ర్ హ‌ర్ష‌ని చూస్తుంటే నాకు జెల‌సీగా ఉంది. నాకు ఓ క‌థ రాయ‌టానికి రెండు, మూడేళ్లు ప‌డుతుంది. కానీ త‌నేమో ఓ సినిమాలోనే ఐదు క‌థ‌లు రాసేశాడు. పంచ‌తంత్రం చాలా మంచి తెలుగు టైటిల్. మూవీ చాలా టీజ‌ర్‌, ట్రైల‌ర్ చాలా బాగా న‌చ్చింది. ప్ర‌శాంత్ అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చాడు. కిట్టు ఎక్స్‌ట్రార్డిన‌రీ పాట‌ల‌ను రాశాడు. స్వాతి నా ఆల్ టైమ్ క్ర‌ష్‌. త‌ను చాలా మంచి న‌టి. శివాత్మిక నా పేరెంట్స్ పెద్ద స్టార్స్ అని కాకుండా సినిమాల్లో క‌ష్ట‌ప‌డుతుంటుంది. ఆడిష‌న్స్ ఇస్తుంటుంది. శివానీ కూడా అంతే. ఇద్ద‌రూ డౌన్ టు ఎర్త్‌. ఇద్ద‌రూ బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. రాజ్  కె.న‌ల్లి మంచి విజువ‌ల్స్ కోసం అస్స‌లు కాంప్ర‌మైజ్ కాడు. గొడ‌వైనా ప‌డ‌తాడు. పంచ‌తంత్రం వంటి కంటెంట్ రిచ్ ఫిలింస్ గురించి ప‌ది మందికి చెప్పాలి. ప‌ది మంది గొప్ప‌గా మాట్లాడాలి. డిసెంబ‌ర్ 9న మూవీ రిలీజ్ అవుతుంది. ఇది మ‌నంద‌రి క‌థ‌. మ‌న మ‌ధ్య ఉండే సినిమా. మ‌నంద‌రి పాత్ర‌లు.. ఇలాంటి మంచి సినిమాల‌ను హిట్ చేస్తేనే ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌కు ఓ ఇన్‌స్పిరేష‌న్ వ‌స్తుంది. ఇంకా మంచి సినిమాలు వ‌స్తాయి. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు.

జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘ నిర్మాత అఖిలేష్ గ‌రుడ వేగ‌, క‌ల్కి సినిమాల నుంచి మాకు మంచి ప‌రిచ‌యం. మా అమ్మాయిలు శివానీ, శివాత్మిక సినిమాల్లోనే పెరిగారు. వాళ్లు మేం కూడా యాక్ట్ చేస్తామ‌ని చెప్ప‌గానే నాకు, రాజ‌శేఖ‌ర్‌కి మామూలు టెన్ష‌న్ రాలేదు. వాళ్ల‌కు ఏదీ కావాల‌న్ని ఆస్థుల‌మ్మి అయినా చేశాం. కానీ సినిమాల్లో న‌టించ‌టం, పేరు తెచ్చుకోవ‌టం మంచి క్యారెక్ట‌ర్స్ రావ‌టం అనేది డెస్టినీ. దీన్ని ఎక్క‌డా కొన‌లేం. అందువ‌ల్ల నేను, రాజ‌శేఖ‌ర్ మా అమ్మాయిల విష‌యం టెన్ష‌న్ ప‌డ్డాం. మీరు న‌టిస్తే మా వంతు స‌పోర్ట్ చేస్తాం. అయితే సినిమాల్లో స‌క్సెస్ రావ‌చ్చు, రాక‌పోవ‌చ్చు. కాబ‌ట్టి మీరు బాధ‌ప‌డ‌కూడ‌ద‌ని మాత్రమే చెప్పాం. హ‌ర్ష‌గారు పంచ‌తంత్రంలో చెప్పిన కంటెంట్ చాల నేచుర‌ల్‌గా ఉంది. అన్ని క‌థ‌ల్లో మ‌న ప్ర‌తి ఒక‌రి జీవితాల్లో ఫేస్ చేసే స‌మ‌స్య‌లు, క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు మ‌నం ఎలా ముందుకు వెళ్లాలనే విష‌యాల‌ను చాలా చ‌క్క‌గా చూపించారు. క‌ష్టాల్లో ముందుకెళ్లే దారులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మ‌నం గ‌ట్టి న‌మ్మ‌కంతో ముందుకెళ్తే ఏదో ఒక‌రోజు క‌చ్చితంగా స‌క్సెస్ సాధిస్తాం. డైరెక్ట‌ర్ చిన్న వ‌య‌సులోనే జీవితాన్ని చాలా స్ట‌డీ చేసి తెర‌కెక్కించిన‌ట్లు అనిపిస్తుంది. ఏం చెప్పాల‌నుకున్నారో దాన్ని అంత క‌చ్చితంగా చూపించారు. నేటి యువ‌త ప్రేమ‌, పెళ్లి, మాన‌వ సంబందాలు గురించి అర్థం కాకుండా బాధ ప‌డుతున్నారు. అలాంటి అంశాన్ని పంచ‌తంత్రంలో చూపించారు. సినిమా ఏదో కోట్లు సంపాదించేయాల‌ని నేను అనుకోవ‌టం లేదు. అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమా అని అంద‌రి అటెన్ష‌న్ పొందాలి. ఆడియెన్స్ సినిమాను క‌చ్చితంగా ఆదరిస్తార‌ని భావిస్తున్నాను. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది వెరీ బెస్ట్‌. ఫ్యామిలీ అంతా క‌లిసి సంతోషంగా చూసే సినిమా ఇది.’’ అన్నారు.

న‌టి స్వాతి మాట్లాడుతూ ‘‘పంచ‌తంత్రం సినిమా ఆడాలి. సినిమాను అంద‌రూ చూసి ఎంక‌రేజ్ చేయండి. అంద‌రూ క‌ష్ట‌ప‌డి పంచ‌తంత్రం చేశాం. ఎమోష‌న‌ల్‌గా క్యారీ అవుతూ ఎంజాయ్ చేసి సినిమాను చేశాం. ఈ మూవీ జ‌ర్నీ మాకు మంచి మెమొర‌బుల్.. రేపు థియేట‌ర్స్‌లో సినిమా చూస్తే మీకు కూడా మంచి మెమొర‌బుల్ మూవీ అవుతుంది’’ అన్నారు.

శివాత్మిక రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ ‘‘అఖిలేష్ కోసమే ఈ సినిమా చేశాను. హ‌ర్ష ఇంత మంచి క‌థ‌ను రాస్తాడ‌ని, ఇంత చ‌క్క‌గా నెరేట్ చేస్తాడ‌ని నేను అనుకోలేదు. లేఖ అనే అంద‌మైన క్యారెక్ట‌ర్‌ను నాకు ఇచ్చినందుకు హ‌ర్ష‌కి థాంక్స్‌. హ‌ర్ష గొప్ప స్థాయికి వెళ‌తాడు. ఈ సినిమా చేసిన‌వారంద‌రూ నా స్నేహితులే. సినిమాటోగ్రాఫ‌ర్ రాజ్‌కి థాంక్స్‌. న‌న్ను చాలా చ‌క్క‌గా చూపించారు. ప్ర‌శాంత్‌గారు, శ్ర‌వ‌ణ్‌గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కిట్టుగారు మంచి డెప్త్‌తో పాట‌లు రాశారు. బ్ర‌హ్మానందంగారు, సముద్ర‌ఖ‌నిగారు, స్వాతిగారితో నా కెరీర్ స్టార్టింగ్‌లోనే క‌లిసి న‌టించటం అదృష్టంగా భావిస్తున్నాను. ప‌ర్స‌న‌ల్‌గా నాకు దివ్య‌, విద్య అనే మంచి ఫ్రెండ్స్‌ను ఈ సినిమాకు ఇచ్చింది. త‌ప్ప‌కుండా సినిమాను డిసెంబ‌ర్ 9న థియేట‌ర్స్‌లో చూడండి. త‌ప్ప‌కుండా సినిమా మీకు న‌చ్చుతుంది’’ అన్నారు.
డైరెక్టర్ హర్ష పులిపాక మాట్లాడుతూ ‘‘ఈవెంట్‌కి హ‌రీష్ శంక‌ర్‌గారు రావ‌టం అనేది మాకు చాలా బ‌లాన్నిచ్చింది. ఈ సినిమా రెండేళ్ల క‌ష్టం. నిజాయ‌తీగా చేసిన ప్ర‌య‌త్నం. సింపుల్ క‌థ‌ల‌ను అందంగా మీ ముందు చూపించే ప్ర‌య‌త్నం చేశాం. ఈ సినిమా ప‌రంగా నేను ముందుగా అభిన‌య కృష్ణ అనే నా స్నేహితుడికి థాంక్స్ చెప్పుకోవాలి. త‌న వ‌ల్లే టికెట్ ఫ్యాక్ట‌రీకి వ‌చ్చి అఖిలేష్‌ను క‌లిశాను. అఖిలేష్ వండ‌ర్‌ఫుల్ ప‌ర్స‌న్‌. నా త‌ర్వాత ఈ సినిమా స‌మానంగా పేప‌ర్ మీద ఎక్స్‌పీరియెన్స్ చేసిన త‌ను. ప్యాష‌న్‌తో పాటు త‌న ద‌గ్గ‌రున్న‌దంతా ఇందులో పెట్టేశాడు త‌ను. ఇండ‌స్ట్రీకి ఇద్ద‌రం కొత్త‌వాళ్లం. స్క్రిప్ట్ మీదున్న కాన్ఫిడెన్స్‌తో ఇద్ద‌రం క‌లిసి ట్రావెల్ చేస్తూ వ‌చ్చాం. ఈ జ‌ర్నీలో చాలా స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. అయితే వాట‌న్నింటినీ క‌లిసే ఫేస్ చేశాం. ఈ సినిమాకు అఖిలేష్ మెయిన్ పిల్ల‌ర్‌గా నిల‌బ‌డి, ధైర్యంగా నిల‌బ‌డ్డాడు. నువ్వు సినిమా మీద‌, స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టు మిగ‌తా వాటిని నేను చూసుకుంటాను అని భ‌రోసా ఇచ్చాడు. నేను చూసిన వాళ్ల‌తో త‌ను చాలా ధైర్య‌వంతుడు. త‌నలాంటి వ్య‌క్తి నా ప‌క్క‌న ఉండటం నా అదృష్టం. మామ అని క్లోజ్‌గా పిలుచుకునేంత నిర్మాత మ‌ళ్లీ నాకు దొరుకుతాడో లేదో కూడా తెలియ‌టం లేదు. సృజ‌న్ మ‌రో నిర్మాత‌. ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో క‌న్‌ఫ్యూజ‌న్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సృజ‌న్ మాతో క‌లిసి స‌పోర్ట్ చేస్తూ ముందుకు న‌డిపించారు. నా కంటే ఈ సినిమాకు ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన వ్య‌క్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ భువ‌న‌న్న‌కే ద‌క్కుతుంది. క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌ ఉష‌గారు కూడా అందించిన స‌పోర్ట్ మ‌ర‌చిపోలేం. ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ మా సినిమాలో యాడ్ కావ‌టానికి  త‌నే ప్ర‌ధాన కార‌ణం. ఈ సినిమాలో విద్య, దివ్య‌, స్వాతి, శివాత్మిక‌, దివ్య‌వాణిగారు మెయిన్ లీడ్స్ క‌నిపిస్తారు. వీరంద‌రూ తెలుగువాళ్లే. ఆరుగురు మేల్ లీడ్స్ రాహుల్‌, న‌రేష్‌, స‌ముద్ర ఖ‌ని, ఉత్తేజ్‌, వికాస్‌, ఆద‌ర్శ్.. అద్భుత‌మైన కంట్రిబ్యూట్ చేశారు. నేను రాసుకున్న ప్ర‌తీ క్యారెక్ట‌ర్‌కు న్యాయం చేయ‌టానికి ప్ర‌తీ ఒక ఆర్టిస్ట్ స‌పోర్ట్ చేశారు. సినిమాటోగ్రాఫ‌ర్ రాజ్ కె.న‌ల్లితో ప్ర‌తీ విష‌యాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవ‌టం వ‌ల్ల ఇస‌నిమాను అనుకున్న స‌మయంలో పూర్తి చేశాం. ఔట్‌పుట్ విష‌యంలో రాజ్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. ఎడిట‌ర్ గ్యారీగారు ఫెంటాస్టిక్ వ‌ర్క్ చేశారు. స్క్రిప్ట్ చ‌దివి ప్రాజెక్ట్‌లోకి వ‌చ్చారు. ప్ర‌శాంత్‌, శ్ర‌వ‌ణ్ మ్యూజిక్ చేశారు. ఇద్ద‌రూ క‌లిసి పోయి మంచి ట్యూన్స్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నేను ఏదైతే అనుకున్నానో దాన్ని పాట‌ల రూపంలో కిట్టు చ‌క్క‌గా అందించారు. డిసెంబ‌ర్ 9న థియేటర్స్‌లో మీ ముందుకు రాబోతున్నాం’’ అన్నారు.

నిర్మాత అఖిలేష్‌ వర్ధన్ మాట్లాడుతూ ‘‘మా టీమ్‌కి స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చిన హ‌రీష్ శంక‌ర్‌గారికి, జీవితా రాజ‌శేఖ‌ర్‌గారికి ధ‌న్య‌వాదాలు. హరీష్ శంకర్‌గారి గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ సినిమాలో నేను చిన్న పార్ట్‌గా మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ప‌ని చేశాను. ఆయ‌న ఇంపాక్ట్ ఇప్పుడు కూడా వ‌చ్చింది. మా సినిమాలో న‌టీన‌టులు ఎంతో స‌పోర్ట్ చేశారు. హ‌ర్ష అండ్ ఇత‌ర టెక్నీషియ‌న్స్‌కు థాంక్స్‌. సృజ‌న్‌గారికి థాంక్స్‌. సినిమా రిలీజ్ త‌ర్వాత మాట్లాడుతాను’’ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ భువ‌న్ మాట్లాడుతూ ‘‘హరీషన్నకు పెద్ద థాంక్స్. ఆయన డైరెక్ష‌న్‌లో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. పంచ‌తంత్రం సినిమా చేయాల‌ని అనుకున్న‌ప్పుడు న‌న్ను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ చేస్తావా అని అడిగిన అఖిలేష్‌కి థాంక్స్ చెప్పాలా.. ఏం చెప్పాలో తెలియ‌టం లేదు. ఈ జ‌ర్నీలో చాలా విష‌యాలు నేర్చుకున్నాను. సాకు సాయంగా సాయి బాబా బాసిరెడ్డిగారు నిల‌బ‌డ్డారు. ఎప్పుడు షూటింగ్ పెట్టుకున్నా, కొత్త వాళ్ల‌మైన మాకు స‌పోర్ట్‌గా నిల‌బ‌డ్డ ఆనంద్‌గారికి థాంక్స్‌. బిగ్ పిక్చ‌ర్స్ శ్రీనివాస్‌గారికి, అలాగే తిండి విష‌యంలో ఏ లోటు రానీయ‌కుండా చూసుకున్న నాగ‌రాజు బాబాయ్ అండ్ టీమ్‌కి థాంక్స్‌. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన త‌ర్వాత‌.. అన్న‌పూర్ణ స్టూడియోస్ వారు సి.వి.రావు, ల‌క్ష్మీప‌తి, బాలాజీ, విశ్వ‌నాథ్ సాయితేజ్ స‌హా అంద‌రూ గైడ్ చేసి ముందుకు న‌డిపించారు. వారందరికీ థాంక్స్‌. కాస్ట్యూమ్స్ చీఫ్ ర‌మేష్ బాబాయ్‌కి థాంక్స్‌. వెంక‌టేష్‌, ప్ర‌దీప్‌కి, డిజిట‌ల్ టీమ్‌కి థాంక్స్‌. నా కుటుంబ స‌భ్యుల‌కు థాంక్స్‌’’ అన్నారు.

క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ ఉష మాట్లాడుతూ ‘‘2020 ఆగ‌స్ట్‌లో పంచ‌తంత్రం ఆలోచ‌న వ‌చ్చింది. అప్ప‌టి నుంచి న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ఇచ్చిన స‌పోర్ట్‌తో మంచి సినిమాను డిసెంబ‌ర్ 9న మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేక్ష‌కులు ఇప్పుడు స‌పోర్ట్ అందిస్తార‌ని భావిస్తున్నాం. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.
సినిమాటోగ్రాఫ‌ర్ రాజ్ కె.న‌ల్లి మాట్లాడుతూ ‘‘డిసెంబర్ 9న పంచతంత్రం రిలీజ్ అవుతుంది. అయితే ఈ జ‌ర్నీ స్టార్ట్ చేసి రెండేళ్లు అవుతుంది. సినిమాలో చూపించిన ఐదు ఎమోష‌న్స్ చూస్తే డైరెక్ట‌ర్ హ‌ర్ష వ‌య‌సు 40-50 ఏళ్లు అనిపిస్తుంది. ఉష‌గారి వ‌ల్ల ఈ సినిమాలో పార్ట్ అయ్యాం. సినిమా కోసం చాలా గొడ‌వ‌లు ప‌డ్డాం. ప్రివ్యూ చూసిన త‌ర్వాత అంద‌రం హ్యాపీగా ఫీల‌య్యాం. సినిమాలో న‌టించిన న‌టీన‌టులు అందించిన స‌పోర్ట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇంత మంచి సినిమాలో నాకు అవ‌కాశం ఇచ్చినందుకు థాంక్స్‌’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ ఆర్‌.విహారి మాట్లాడుతూ ‘‘మా పంచ‌తంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వ‌చ్చిన హ‌రీష్ శంక‌ర్‌గారికి థాంక్స్‌. ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న ‘ఏటీఎం’లోనూ నేను వ‌ర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ద‌ర్శ‌కుడు హ‌ర్ష పులిపాక బ్రిలియంట్ రైటింగ్‌. ఐదు డిఫ‌రెంట్ క‌థ‌లు, ఐదు ర‌క‌ర‌కాల ఎమోష‌న్స్ ఉంటాయి. నా వంతుగా బెస్ట్ ఇచ్చాన‌నే అనుకుంటున్నాను. శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌టం చాలా హ్యాపీగా ఉంది. కిట్టు మంచి సాహిత్యం ఇచ్చాడు. న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ మంచి హార్డ్ వ‌ర్క్ చేసి మంచి ఔట్‌పుట్ ఇచ్చారు. రాజ్ కె.న‌ల్లి సూప‌ర్బ్ సినిమాటోగ్ర‌ఫీ వ‌ల్ల నేను ఇంకా బెస్ట్ ఇవ్వ‌డానికి వీలైంది. యాంథాలజీ అనేది థియేటర్స్‌లో రావ‌టం రేర్ ఫీట్‌. హ‌ర్ష నాకు క‌థ నెరేట్ చేసినప్పుడు ఇది వెబ్ సిరీస్ క‌దా.. ఓటీటీకే చేస్తున్నాం క‌దా అని అనుకున్నాను. కానీ థియేట‌ర్స్‌లో తీసుకొస్తున్నారు. మంచి కంటెంట్‌ను ఆడియెన్స్ ఎంక‌రేజ్ చేస్తార‌ని భావిస్తున్నాను. ’’ అన్నారు.

ఇంకా ఈ ప్రీ రిలీజ్ కార్య‌క్ర‌మంలో న‌టి విద్య, న‌టి దివ్య శ్రీపాద, పాట‌ల ర‌చ‌యిత కిట్టు విస్సాప్ర‌గ‌డ‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

నటీనటులు:
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు.

సాంకేతిక వర్గం:

బ్యాన‌ర్స్‌: టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్, నిర్మాతలు: అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు, రైటర్‌–డైరెక్టర్‌: హర్ష పులిపాక, లైన్ ప్రొడ్యూసర్: సునిత పడోల్కర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భువన్‌ సాలూరు, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉషారెడ్డి వవ్వేటి, సంగీత దర్శకులు: ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్, సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి, మాటలు: హర్ష పులిపాక, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సోసియేట్ డైరెక్టర్: విక్రమ్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అయేషా మరియం, ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌, సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సాయి బాబు వాసిరెడ్డి,  పి.ఆర్‌.ఓ:  నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).

A content-rich film like ‘Panchathantram’ should be watched by all: Harish Shankar

Release date of the movie is December 9

‘Panchathantram’, starring ‘Kathaa Brahma’ Brahmanandam, Samuthirakani, Swathi Reddy, Shivathmika Rajasekhar, young hero Rahul Vijay, Divya Sripada, ‘Mathu Vadalara’ fame Naresh Agasthya and Srividya, is produced by Ticket Factory and S Originals. Written and directed by Harsha Pulipaka, it is produced by Akhilesh Vardhan and Srujan Yarabolu. The Weekend Show is presenting it. The film is going to be released in theatres worldwide on December 9. 

The film’s pre-release event was held in Hyderabad on Wednesday. Powerful Director Harish Shankar graced the occasion as the chief guest.

Director Harish Shankar said that he has had a nice association with Ticket Factory, especially with Akhilesh and Bhuvan. “Bhuvan used to look after my social media and PR many years ago. It’s good that he has become an Executive Producer. As a filmmaker, I prefer to work with Telugu-speaking actors. I am someone who changes the lines from one take to the next. If a non-Telugu actress wants time for preparation, it puts me off. Coming to ‘Panchathantram’, it is a content-rich film. I won’t agree if you call it a small film. Director Harsha has done a great job. It takes years for me to write a story. But he has written five stories for this one film. The title is quite evocative. The teaser and trailer are superb. Kittu Vissapragada’s lyrics and Prashanth R Vihari’s music are top-notch. Colours Swathi has always been my crush. Shivathmika is working hard and is not relying on her parents. Shivani, too, is hard-working. Both sisters are so down to earth. ‘Panchathantram’ has been made without compromising on quality. This movie belongs to everyone. It’s getting released on December 9. Only when films like this one are encouraged will directors and producers feel motivated,” he said.

Jeevitha Rajasekhar said, “We have known producer Akhilesh since the days of ‘PSV Garuda Vega’. When Shivani and Shivathmika told us they want to step into movies, I and my husband were tensed. It’s because a career in cinema and success can’t be bought with money. They are all about destiny. We assured our daughters of full support but cautioned them that success in cinema is not guaranteed. ‘Panchathantram’ is a very slice-of-life movie that mirrors reality. In times of adversity, the door to happiness is always open. The director has written a deep film at a young age. Today’s youngsters are finding it hard to understand life and human relations. This is a content-rich film that will surely find takers. I wish the team all the best.”

Swathi Reddy said that a film like ‘Panchathantram’ needs to be encouraged by one and all. “It was an emotional and enjoyable journey while doing it. It has been a memorable journey. I hope the audience, too, are going to find it memorable,” she added.

Shivathmika began her speech by thanking her mother and Harish Shankar, adding that she has done the film for producer Akhilesh. “Playing Lekha, a beautiful character, was great. The entire team of this film are my friends. I want success for everyone. Director Harsha must reach great heights. If I am looking so beautiful in the film, it’s because of cinematographer Raj. It was a pleasure working with Prashanth, Shravan, Garry and others. A film with Brahmanandam garu, Samuthirakani garu and Swathi garu so early in my career feels like a blessing. This project has given me friendships for a lifetime. I have got friends in Divya and Vidya. They are so talented. Every one of us should win.  I am an emotional wreck at this point. I promise you are going to love our movie.” 

Producer Akhilesh Vardhan thanked Harish Shankar and Jeevitha Rajasekhar, adding that he worked on the marketing of ‘Gaddalakonda Ganesh’. He profusely thanked his cast and crew.

Executive Producer Bhuvan said thanked producer Akhilesh for roping him in. He added that he is waiting for Harish Shankar’s film with Pawan Kalyan. He thanked Baba Basireddy for standing by him. He thanked everyone associated with the project, including the support staff and catering department.

Creative Producer Usha said that the journey of the film began in 2020. “Thanks to the support of everyone, we have successfully made this film. We are expecting the support of the audience,” she added.

Cinematographer Raj K Nelli said, “I got onto this project thanks to Usha. The depth in the film might make you feel that the director is in his 40s. We had a lot of arguments while making the film. At the end of the day, we are happy with how it has shaped up. I thank the makers for this opportunity.”

Music director Prashanth R Vihari said, “I thank Harish Shankar garu for gracing this event. I am working under his supervision on ‘ATM’. Coming to ‘Panchathantram’, its director is quite talented. It has been great working with Shravan Bharadwaj and lyricist Kittu. The cinematography is another highlight. Anthologies are a rare feat. It’s good that it’s heading to the theatres and not just OTT.”

Cast:

Brahmanandam, Samuthirakani, Swathi Reddy, Shivathmika Rajasekhar, Rahul Vijay, Naresh Agasthya, Divya Sripada, Srividya, Vikas, Adarsh Balakrishna and others.

Crew:

PRO: Naidu Surendra Kumar-Phani Kandukuri (Beyond Media)Costume Designer: Ayesha MariamEditor: Garry BHCinematographer: Raj K NalliProduction Controller: Sai Babu VasireddyLine Producer: Sunitha PadolkarExecutive Producer: Bhuvan SaluruCreative Producer: Ushareddy VavvetiDialogues: Harsha PulipakaLyrics: Kittu VissapragadaMusic Directors: Prashanth R Vihari, Shravan Bharadwaj Co-Producers: Ramesh Veeragandhan, Ravali KalangiProducers: Akhilesh Vardhan & Srujan YaraboluWriter, Director: Harsha Pulipaka

Tags

Related Articles

Back to top button
Close
Close