
సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంగ రంగ వైభవంగా ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ కుమార్తె నీలిమ గుణ, రవి ప్రఖ్యా వివాహం
Neelima Guna, the daughter of famous director Guna Shekhar, and Ravi Prakhya got married in the presence of cine and political celebrities.

కళ్యాణం కమనీయం.. హిందూ సాంప్రదాయంలో పెళ్లికి ఉన్న ప్రాముఖ్యతే వేరు.
ఆకాశమంత పందిరి.. భూవేదవంత అరుగు సిద్ధం చేసి దానిపై వధువరులను కూర్చుండబెట్టి ఒక్కటి చేసి మంగళ వాయిద్యాలతో వేద మంత్రాల సాక్షిగా బంధు మిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఆశీర్వదించటానికి సిద్ధమయ్యారు ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్. ఆయన ప్రథమ కుమార్తె, శాకుంతలం మూవీ ప్రొడ్యూసర్ అయిన చి.సౌ.నీలిమ గుణ వివాహం డిసెంబర్ 2 రాత్రి 12 గంటల 31 నిమిషాలకు (తెల్లవారితే శనివారం) .. ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త, ఎంటర్ ప్రెన్యూరర్, శ్రీ శక్తి గ్రూప్ అధినేతలు, హైదరాబాద్ వాస్తవ్యులు అయిన డా.రామకృష్ణ పింజల, శ్రీమతి సత్య పింజల గారి కుమారుడు రవి ప్రఖ్యాతో జరగనుంది. అంగ రంగ వైభవంగా జరగుతున్న వీరి పెళ్లి హైదరాబాద్లోని తాజ్ ఫలక్ నామా ప్యాలెస్ వేదిక అయ్యింది. పలువురు సినీ, రాజకీయ రంగంలోని ప్రముఖులు పెళ్లికి విచ్చేస్తున్నారు.











