MOVIE NEWS
Trending

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘రామసక్కనోళ్లు’!!

ఎస్‌ఎస్‌ఎస్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై సునయన పరాంకుశం సమర్పణలో సతీష్‌ కుమార్‌ సాత్పడి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘రామసక్కనోళ్లు’. ఫహీం సర్కార్‌ దర్శకుడు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌, ట్రైలర్ విడుదలై సినిమాపై క్రేజ్‌ ఏర్పరిచాయి. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్‌ చేసిన మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ..‘‘కనీస బాధ్యతలను విస్మరించే నేటి యువతకు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు మెండుగా ఉన్నాయి. చిత్ర యూనిట్‌ అందరికీ నా శుభాకాంక్షలు ’’ అన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సతీష్‌ కుమార్‌ సాత్పడి మాట్లాడుతూ…‘‘ ఇప్పటికే మా చిత్రం టీజర్‌ను మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య గారు, పోస్టర్‌ను మంత్రివర్యులు ఎ.ఇంద్రకరణ్‌ రెడ్డి గారు, ట్రైలర్ మరో మంత్రివర్యులు హరీష్‌రావు గారు లాంచ్‌ చేశారు. వీటన్నింటికీ మంచి స్పందన లభిస్తోంది. ఇక కథ విషయానికొస్తే ఓ గ్రామంలో కొందరు పెద్ద మనుషులు గా చలామణీ అవుతూ చేసే అరాచకాలను నలుగురు కుర్రాళ్లు ఎలా ఎదుర్కొన్నారు. ఆ గ్రామ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేసారు, తాము పుట్టిన మట్టి రుణం ఎలా తీర్చుకున్నారు అనేది కథాంశం. యువతకు ఇన్‌స్పిరేషన్‌గా ఉంటూ పెద్దలను సైతం ఆలోచింపజేసేలా సినిమా ఉంటుంది. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్‌ వారు యుబైఏ సర్టిఫికెట్‌తో పాటు సినిమా బావుందంటూ ప్రశంసించారు. త్వరలో సినిమా విడుదల వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ…‘‘కొత్త రచయితలను పరిచయం చేస్తున్నాం. ఇక ప్రత్యేక పాత్రలో టాలీవుడ్‌ సన్నిలియోన్‌గా పేరు తెచ్చుకున్న మేఘనాచౌదరి చేసిన హంగామా యువకుల గుండెల్లో గిలిగింతలు పెట్టడం ఖాయం. ఆదిలాబాద్‌, నిర్మల్‌, హైదరాబాద్‌, విశాఖపట్నం, ఊటిలో సినిమా చిత్రీకరించాం. నిర్మాత ఎక్కడా రాజీ పడుకుండా నిర్మించారు’’ అన్నారు.
చమ్మక్‌ చంద్ర, సలీం షేక్‌ హీరోలుగా నటిస్తున్నారు.
మేఘనా చౌదరి, షియాజీ షిండే, బ్రహ్మానందం, నాగినీడు, చలపతి , రఘుబాబు, బ్రహ్మాజీ, అప్పారావు, సుమన్‌శెట్టి, చిత్రం శ్రీను, సుధీర్‌, బాబుసింగ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నఈ చిత్రానికి క్రియేటివ్‌ డైరక్టర్‌: చెన్నమాధవుని కార్తికేయన్‌రాజు, కో`డైరక్టర్‌: రాంబాబు, సంగీతం:ఘంటాడి కృష్ణ, డిఓపి:జగన్‌, రైటర్స్‌:సాహితిరత్న, ఎడవల్లి, ప్రభాకర్‌, అంబట్ల, నిర్మాత:సతీష్‌ కుమార్‌ సాత్పడి, దర్శకత్వం:ఫహీం సర్కార్‌.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close