
రాజ్ తరుణ్, ఎ.ఎస్ రవికుమార్ చౌదరి, సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా, మల్కాపురం శివకుమార్ నూతన చిత్రం ‘తిరగబడరా సామి’ గ్రాండ్ గా ప్రారంభం
Raj Tarun, AS Ravikumar Chaudhary, Suraksha Entertainment Media, Malkapuram Sivakumar's new film 'Thiragabadara Sami' has a grand launch.

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటిసూపర్ హిట్ చిత్రాల దర్శకుడు ఎ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై నిర్మాత
మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘తిరగబడరా సామి’.
ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. నిర్మాత మండలి అధ్యక్షులు సి.కళ్యాణ్ క్లాప్ ని ఇవ్వగా, ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మరో ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు స్క్రిప్ట్ ను దర్శకుడు ఎఎస్ రవికుమార్ చౌదరికి అందించారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, దర్శకుడు వీరశంకర్, గోసంగి సుబ్బారావు, నర్రాశివాసు, రాజా వన్నెం రెడ్డి, బెక్కం వేణుగోపాల్, నిర్మాతల సంఘం కార్యదర్శి టి. ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాత డి. యస్ రావు, జీవిత రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు
ఈ చిత్రానికి జె.బి సంగీతం అందిస్తుండగా.. జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫర్ గా, ఎక్సిక్యూటివ్ నిర్మాతగా బెక్కెం రవీందర్ పని చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చితం త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించుకోబోతుంది.
తారాగణం: రాజ్ తరుణ్
సాంకేతిక విభాగం
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎ.ఎస్ రవికుమార్ చౌదరి
బ్యానర్ : సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా
నిర్మాత : మల్కాపురం శివకుమార్
ఛాయాగ్రహణం: జవహర్ రెడ్డి
సంగీతం: జె. బి
ఆర్ట్ : రవికుమార్ గుర్రం
ఎక్సిక్యూటివ్ నిర్మాత: బెక్కెం రవీందర్
పీఆర్వో : వంశీ శేఖర్
Pro: Vamsi – Shekar






