MOVIE NEWS

కార్తికేయ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వంలో లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ‘బెదురులంక 2012’ ఫస్ట్ లుక్ విడుదల

Hero Kartikeya, Neha Shetty’s exciting next ‘Bedurulanka 2012’ First Look out!

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘బెదురులంక 2012’. ఇందులో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయిక. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న ‘కలర్ ఫొటో’ నిర్మించిన బెన్నీ ముప్పనేని నిర్మిస్తున్న తాజా చిత్రమిది.  
ఈ రోజు ‘బెదురులంక 2012’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అలాగే, మోషన్ పోస్టర్ కూడా! సోషల్ మీడియాలో, ప్రేక్షకుల నుంచి ఫస్ట్ లుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది. వినూత్నంగా ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు.    

ఈ సందర్భంగా చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ “మోషన్ పోస్టర్ చూస్తే ‘బెదురులంక 2012’ ఎంత విభిన్నంగా ఉండబోతుందనేది అర్థం అవుతుంది. ఒక పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో తీసిన చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్. కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ‘డీజే టిల్లు’ తర్వాత నేహా నటిస్తున్న చిత్రమిది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు అద్భుతమైన బాణీలు అందించారు. ఓ పాటను స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారు. కెమెరా వర్క్ సూపర్ అంటారంతా! ఆర్ట్ వర్క్ కూడా ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. డ్రామా, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ సినిమాలో మెయిన్ హైలైట్స్ అవుతాయి. థియేటర్లలో ప్రేక్షకులను ‘బెదురులంక’ అనే కొత్త ప్రపంచంలోకి సినిమా తీసుకెళ్తుంది. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అని చెప్పారు.
  
దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ “డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ కనిపిస్తారు. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంది” అని చెప్పారు.  

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృధ్వీ కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల, పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ, ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన – దర్శకత్వం: క్లాక్స్.

Hero Kartikeya, Neha Shetty’s exciting next ‘Bedurulanka 2012’ First Look out!

Young hero Kartikeya Gummakonda’s next film ‘Bedurulanka 2012’ stars ‘DJ Tillu’ fame Neha Shetty as the female lead. Directed by Clax under Loukya Entertainments C. Yuvaraj is presenting it and National Award Winning movie ‘Colour Photo’ producer Ravindra Benerjee Muppaneni (Benny) is backing this project.

Natural Star Nani has launched the First Look and Motion Poster of ‘Bedurulanka 2012’ today and it instantly gained superb response on social media. Amidst the buzz around it, most of them referred to the poster as unique and intriguing.

Speaking on the occasion, producer Ravindra Benerjee Muppaneni (Benny) says “Our ‘Bedurulanka 2012’ motion poster gives an insight on the unique concept of film. The story is based on the consequences commencing around the ‘End of an epoch’ in a village. It’s an out-n-out fun entertainer. Kartikeya, Neha Shetty’s combo will be eye-candy. Shooting is on the final stage. We shot in & around Yanam, Kakinada, Godavari. There are 5 songs in the film with extraordinary music by melody brahma Manisharma garu. Late Srivennela Seetharama shastry garu wrote a beautiful song for this film. Camera work is superb, Art work is fantastic. Exciting drama, comedy and emotions will be the major highlights of the movie. Visuals will take the audience to a new world of Bedurulanka. We’re planning to bring this new-age concept film in the new year”

Director Clax says “It’s a Dramedy (Drama+Comedy) genre film. You will see a new performer in Kartikeya. The story is based on comedy, emotions and thrill with a native village backdrop. We’ve strong content in this film along with hilarious comedy.”

The exciting cast includes Ajay Ghosh, Satya, Raj Kumar Kasireddy, Srikanth Ayyengar, ‘Auto’ Ram Prasad, Goparaju Ramana, LB Sriram, Surabhi Prabhavathi, Kittayya, Anithanath, Divya Narni and others.

Fights: Anji, Prithvi Raj
Costume Designer: Anusha Punjala
Editing: Viplav Nyasadam
Lyrics: Sirivennela Seetharamashastry, Kittu Vissapragada, Krishna Chaitanya
Production Designer: Sudheer Macharla
Co-producers: Avaneendra Upadrasta & Vikas Gunnala
Executive Producer: Durgarao Gunda
Cinematography: Sai Prakash Ummadisingu, Sunny Kurapati
Music: Manisharma
Dance: Brinda Master, Moin Master
Producer: Ravindra Benerjee Muppaneni
Written & Directed by: Clax

Tags

Related Articles

Back to top button
Close
Close