MOVIE NEWS

‘పఠాన్’ థియేట్రికల్ ట్రైలర్ కంటే ముందే పాటలను విడుదల చేస్తాం: ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్‌ * ట్రైల‌ర్ కంటే ముందే పాట‌ల‌ను విడుద‌ల చేసి సినిమాపై అంచ‌నాల‌ను పెంచబోతున్న మేక‌ర్స్‌ – ‘We will release the songs of the film before the theatrical trailer!’ : Siddharth Anand details out how the makers want to keep building the intrigue of the plot of Pathaan by releasing the songs first

‘We will release the songs of the film before the theatrical trailer!’ : Siddharth Anand details out how the makers want to keep building the intrigue of the plot of Pathaan by releasing the songs first

‘పఠాన్’ థియేట్రికల్ ట్రైలర్ కంటే ముందే పాటలను విడుదల చేస్తాం: ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్‌

* ట్రైల‌ర్ కంటే ముందే పాట‌ల‌ను విడుద‌ల చేసి సినిమాపై అంచ‌నాల‌ను పెంచబోతున్న మేక‌ర్స్‌

బాలీవుడ్ బాద్ షా షారూ క్ ఖాన్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ప‌వ‌ర్ ప్యాక్‌డ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘పఠాన్’. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా, ఏస్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్ క‌లిసి ‘పఠాన్’ చిత్రాన్ని ఇండియా బిగ్గెస్ట్ యాక్ష‌న్ చిత్రంగా, విజువ‌ల్ వండ‌ర్‌గా మార్చ‌టానికి అడుగులు వేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌ష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో, ఆశ్చ‌ర్య‌ప‌రిచే యాక్ష‌న్‌తో రూపొందిస్తోంది. ఆదిత్య చోప్రా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ స్పై యూనివ‌ర్స‌ల్ మూవీలో ఇండియా బిగ్గెస్ట్ సూప‌ర్‌స్టార్స్ షారూక్ ఖాన్‌, దీపికా ప‌దుకొనె, జాన్ అబ్ర‌హం త‌దిత‌రులు న‌టిస్తున్నారు. జ‌న‌వ‌రి 25, 2023లో హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ‘పఠాన్’ సినిమా రిలీజ్ అవుతుంది.

రీసెంట్‌గా విడుద‌లైన ‘ప‌ఠాన్’ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసింది. నాలుగేళ్ల త‌ర్వాత షారూక్ ఖాన్ న‌టిస్తోన్న ఈ చిత్రంలో పిచ్చెక్కించే యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చూసి ఆడియెన్స్ ఊగిపోయారు. దీపికా ప‌దుకొనెని ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని పాత్ర‌లో చూడ‌బోతున్నార‌ని.. దేశాన్ని కాపాడ‌టానికి షారూక్, జాన్ అబ్ర‌హం మ‌ధ్య న‌డిచే ఫైట్స్  ఇంత‌కు ముందు సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ‌ని విధంగా ఉంటాయ‌ని మేక‌ర్స్ ప్రామిస్ చేస్తున్నారు.

‘పఠాన్’ మూవీ క‌థాంశం దాని చుట్టూ రూపొందించిన ఇత‌ర ఎలిమెంట్స్ ఆడియెన్స్‌ను అబ్బుర‌ప‌రిచేలా ఉంటాయి. ఇప్ప‌టికే సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎలా ఎదురు చూస్తున్నార‌నే విష‌యాన్ని రీసెంట్‌గా వ‌చ్చిన టీజ‌ర్‌, పోస్ట‌ర్స్‌కు వ‌చ్చిన రెస్పాన్స్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే ‘పఠాన్’ ప్ర‌మోష‌న్స్ శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత‌గా పెంచేలా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌టానికి కంటే ముందే జ‌న‌వ‌రిలో రెండు అద్బుత‌మైన పాట‌ల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు నిర్ణ‌యించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ ‘‘పఠాన్ చిత్రంతో రెండు అద్భుతమైన పాటలున్నాయి. ప్రేక్షకులు ఊహించ‌లేనంత గొప్ప‌గా ఉండ‌ట‌మే కాదు.. ఆ ఏడాదిలో చార్ట్ బ‌స్ట‌ర్‌లో అవే టాప్ సాంగ్స్‌గా నిలుస్తాయి. కావున ఆ పాట‌ల‌ను ప్రేక్ష‌కులు ఆస్వాదించ‌టానికి కావాల్సినంత స‌మ‌యం కూడా ఉండాల‌ని మేం భావించాం. అందుక‌నే ట్రైల‌ర్ కంటే ముందే పాట‌ల‌ను విడుద‌ల చేస్తున్నాం. డిసెంబ‌ర్‌లో ప్ర‌పంచ‌మంతా డిసెంబ‌ర్‌లో పార్టీ, హాలీడే మూడ్‌లో ఉంటుంది. కాబ‌ట్టి పాట‌ల‌ను విడుద‌ల చేయ‌టానికి అది కూడా ఓ కార‌ణం. సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను పెంచుతూ.. సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను క్యారీ చేయ‌టం మా ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాటజీలో ఓ భాగం. కాబ‌ట్టి ప‌ఠాన్ మ్యూజిక్‌కు డాన్సులు చేయ‌టానికి సిద్ధంగా ఉండండి’’ అన్నారు.

&&&&&&&&&

‘We will release the songs of the film before the theatrical trailer!’ : Siddharth Anand details out how the makers want to keep building the intrigue of the plot of Pathaan by releasing the songs first

Aditya Chopra and ace director Siddharth Anand are aiming to make Pathaan India’s biggest action spectacle! The visually spectacular Yash Raj Films’ action extravaganza, Pathaan, is part of Aditya Chopra’s ambitious spy universe and has the biggest superstars of the country Shah Rukh Khan, Deepika Padukone and John Abraham in it. The teaser of Pathaan wreaked havoc on the internet as people went hysterical about SRK’s return to the cinema after 4 long years, the insane action spectacle that the makers are promising, a ravishing never seen before avatar of Deepika Padukone and the fight between the good and the evil as SRK takes on John Abraham to save India!

We have confirmed news that the makers want to keep everything about the plot of Pathaan under wraps to build anticipation and feed into the incredible fan frenzy that is already surrounding the film. So, Pathaan’s marketing campaign will first see two spectacular songs of the film being dropped first before the trailer is unveiled in January!

Siddharth Anand says, “Pathaan has two spectacular songs. And fortunately both are so incredible that they are potential chartbuster anthems of the year. Hence, we decided to give people ample time to enjoy the songs before the film releases.”

He adds, “Especially since December is a party and holiday season for people across the world. So we will release the songs of the film before the theatrical trailer. This is also part of our strategy to hold back the plot of Pathaan to as close to the release as possible. So get ready to dance to the music of Pathaan.”

Pathaan is set to release on Jan 25, 2023 in Hindi, Tamil and Telugu.

Tags

Related Articles

Back to top button
Close
Close