
MOVIE NEWSSpecial Bites
నాన్న గారు ఎల్లప్పుడూ మన గుండెల్లో, మన మధ్యే ఉంటారు: సూపర్ స్టార్ మహేష్ బాబు
Nanna garu is always in our hearts and in our midst: Superstar Mahesh Babu


సూపర్‌స్టార్ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మాట్లాడుతూ..‘నాన్న గారు నాకు చాలా ఇచ్చారు. నాన్న గారు ఇచ్చిన దాంట్లో అన్నిటికంటే గొప్పది మీ అభిమానం. ఆయనకి ఎప్పుడూ రుణపడి వుంటాను. నాన్న గారు ఎల్లప్పుడూ నా గుండెల్లో వుంటారు. మీ గుండెల్లో వుంటారు. మన మధ్యే ఉంటారు. మీరందరూ ఇక్కడకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం, ఆశీస్సులు నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.
Pro: Vamsi – Shekar