MOVIE NEWS

విష్ణు విశాల్, చెల్లా అయ్యావు, ఆర్ టి టీం వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ ‘మట్టి కుస్తీ’ నుండి చల్ చక్కని చిలక పాట విడుదల

Vishnu Vishal, Chella Ayyavu, RT Team Works, Vishnu Vishal Studios 'Matti Kusti' Chala Chilaka Song Released

హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ‘ఆర్ టీ టీం వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది.

‘మట్టి కుస్తీ’ లో విష్ణు విశాల్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి చల్ చక్కని చిలక పాటని విడుదల చేశారు మేకర్స్. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మిల అందమైన పెళ్లి పాటిది.

జస్టిన్ ప్రభాకరన్ ఈ పెళ్లి పాటని మళ్ళీ మళ్ళీ వినాలనిపించే క్యాచి ట్యూన్ గా కంపోజ్ చేశారు. రెహమాన్ పాటకు చక్కని సాహిత్యం అందించారు. హేమచంద్ర వాయిస్ పాటకు మరింత ఆకర్షణ తెచ్చింది. ఈ పెళ్లి పాటలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మిల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది.

ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్ గా రిచర్డ్ ఎం నాథన్, ఎడిటర్ గా ప్రసన్న జికె పని చేస్తున్నారు.  

తారాగణం: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: చెల్లా అయ్యావు
నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్
బ్యానర్లు: ఆర్ టి  టీం వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్
డీవోపీ:  రిచర్డ్ ఎం నాథన్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
ఎడిటర్: ప్రసన్న జికె
ఆర్ట్ డైరెక్టర్: ఉమేష్ జే కుమార్
లిరిక్స్: వివేక్
పీఆర్వో వంశీ-శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Check Also

Close
Back to top button
Close
Close