MOVIE NEWS

మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో సంవత్సరం కాలంపాటు జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాతగాంచిన శక పురుషుడు యన్.టి.ఆర్ శత జయంతి మహోత్సవాల్లో భాగంగా యావత్ ఆంధ్రులు గర్వించే విధంగా తెనాలిలో ఈ నెల 27 వ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నాజరుపేట యన్.వి.ఆర్ కన్వెంక్షన్ సెంటర్ నందు యన్.టి.ఆర్ శతాబ్ది చలన చిత్ర పురస్కార మహోత్సవ సభ జరుగును. ప్రఖ్యాత సినీ సంభాషణల రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా గారి సభా నిర్వహణలో

YTR Centenary Film Awards Mahotsava Sabha will be held.

• పురస్కార గ్రహీత :ప్రఖ్యాత జాతీయ సినీ నటి, పూర్వ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి జయప్రద గారికి యన్.టి.ఆర్ గారి ఆరువ కుమారుడు శ్రీ నందమూరి రామకృష్ణ గారి చేతులు మీదుగా పురస్కారాన్ని అందించెదరు.

ఈ కార్యక్రమానికి లోకసత్తా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జయప్రకాష్ నారాయణ గారు ముఖ్య అతిధులుగా, ఆత్మీయ అతిధులుగా సుప్రసిద్ధ సినీ దర్శకులు శ్రీ ఏ.కోదండరామిరెడ్డి గారు విచ్చేయుచున్నారు

యన్.టి.ఆర్ అభిమాన సత్కార గ్రహీత మైథిలి అబ్బరాజు , ఆత్మీయ అతిధులుగా శ్రీ నెట్టెం రఘురాము గారు విచ్చేయుచున్నారు కావున ఈ కార్యక్రమానికి కాలాభిమానులు అందరు విచ్చేసి జయప్రదం చేయవల్సిందిగా కోరుతున్నాం.

ఇట్లు
శక పురుషుడు యన్.టి.ఆర్ శత జయంతి మహోత్సవముల కమిటీ

Tags

Related Articles

Back to top button
Close
Close