Events/PressmeetsMOVIE NEWSSpecial Bites

‘Meet Cute’ is a pleasant web series: Natural Star Nani

'Meet Cute' is a pleasant web series: Natural Star Nani

‘Meet Cute’, the web series to be streamed on SonyLIV from November
25, is directed by Deepthi Ganta. She is the elder sister of Natural
Star Nani. It strings together five different stories as an anthology.
Varsha Bollamma, Sri Divya, Sameer, Ashwin Kumar, Satyaraj, Ruhani,
Raja Chembolu, Rohini Molleti, Akanksha Singh, Deekshit Shetty,
Alekhya Harika, Adash Sharma, Shiva Kandukuri, Sunaina and others have
played key roles in it.

On Monday, Nani and Deepthi Ganta interacted with the press to speak their mind.

Director Deepthi Ganta said, “A short film that I made some years ago
was my first creative outing. When I wrote a short story and showed it
to Nani, he asked me to write three to four stories so that an
anthology could be made. Despite his prodding, I waited for inspiring
thoughts to come to my mind. I like to interact with strangers during
journies and other occasions. ‘Meet Cute’ imagines situations where
persons who don’t know each other strike up conversations. Their run
into each other accidentally in ‘Meet Cute’. We come across such
situations in our lives at various situations. I am happy that
talented artists have become part of the film. This is a drama based
in urban settings. And despite that, the audience are going to relate
to it. Nani asked me to write a nice love story as well in the
anthology. I like to pen feel-good stories in the future as well.”

Nani said, “I didn’t read the script of ‘Meet Cute’ for many days even
though those in my family who had read it endorsed it gleefully. I
gave it a reading after my sister pushed me to. It took me just a few
pages to be immersed in the story. The scenes are so interesting. I
would have produced ‘Meet Cute’ even if someone else had been its
writer-director. Had the script reached my office without the writer’s
phone number, I would have done my best to trace that person and
offered to produce it. The characters, their conversations, and the
situations they encounter in ‘Meet Cute’ are all very natural. The
stories are meant for OTT, not a film. When you are making a film, it
demands dramatic and cinematic liberties to be taken. In ‘Meet Cute’,
the moves made by the characters and how the stories end are exciting.
I don’t have a character in it that I would have played. Many assumed
that I will be seen in a guest role. But I didn’t want to do anything
for the sake of it. The story has to demand it. Usually, the different
stories in anthologies are directed by different directors. ‘Meet
Cute’ is different. Each story has been done by my sister. It’s a
pleasant series with real conversations. The scenes that come between
Rohini and Akanksha are very good. Wall Poster Cinema is going to be
always at the forefront of backing quality content.”

“మీట్ క్యూట్” ప్లెజంట్ వెబ్ సిరీస్ గా ఆకట్టుకుంటుంది – నాచురల్ స్టార్ నాని

నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించిన తొలి వెబ్
సిరీస్ మీట్ క్యూట్. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని ఈ సిరీస్ ను
నిర్మించారు. ఐదు కథల ఆంథాలజీగా ఆమె తెరకెక్కించిన ఇందులో వర్ష బొల్లమ్మ,
శ్రీదివ్య, సమీర్, అశ్విన్ కుమార్, సత్యరాజ్, రుహానీ సఱ్మ, రాజ్ చెంబోలు,
రోహిణి మొల్లేటి, ఆకాంక్షా సింగ్, దీక్షిత్ శెట్టి అలేఖ్య హారిక, ఆదా
శర్మ, శివ కందుకూరి, సునైన తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 25న
సోని లివ్ లో మీట్ క్యూట్ ఎక్స్ క్లూజివ్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఈ
సందర్భంగా దీప్తి, నాని తాజా ఇంటర్వ్వూలో మీట్ క్యూట్ విశేషాలు తెలిపారు

దర్శకురాలు దీప్తి గంటా మాట్లాడుతూ…నేను గతంలో ఒక షార్ట్ ఫిలిం చేశాను.
మీట్ క్యూట్ లో ఒక కథ రాసినప్పుడు నానికి వినిపిస్తే ఇలాంటివి ఇంకో మూడు
నాలుగు రాయి కలిపి ఆంథాలజీ చేయొచ్చు అని సలహా ఇచ్చాడు. నాని అడిగినా కూడా
ఏదైనా మంచి ఆలోచన ఇన్స్పైర్ చేశాకే స్క్రిప్ట్ రాశాను. ప్రయాణాల్లో, ఇతర
సందర్భాల్లో ఎవరైనా తెలియని వారితో పరిచయం చేసుకుని మాట్లాడటం నాకు
అలవాటు. అలాంటి అపరిచిత వ్యక్తుల మధ్య సంభాషణ ఎలా ఉంటుంది అనే ఊహతో ఈ
స్క్రిప్ట్ మొదలుపెట్టాను. మన లైఫ్ లో ఎదురయ్యే ప్లెజంట్ మూమెంట్స్ తో
పాటు వివిధ సందర్భాలను ఈ కథల్లో చూపిస్తాం. సత్యరాజ్, అశ్విన్, ఆదా శర్మ
ఇలాంటి మంచి ఆర్టిస్టులు నా కథలోకి రావడం సంతోషాన్నిచ్చింది. అర్బన్
బేస్డ్ గా ఈ కథ సాగుతుంది. అయినా ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యేలా
ఉంటుంది. ఓ మంచి లవ్ స్టోరి రాస్తే ఆ కథను నాని హీరోగా తెరకెక్కిస్తా.
ఇకపైనా మంచి ఫీల్ గుడ్ స్క్రిప్ట్ రాసి డైరెక్ట్ చేస్తాను. అని
చెప్పింది.

నాని మాట్లాడుతూ…ఫస్ట్ ఈ స్క్రిప్ట్ చాలా రోజులు చదవకుండా పక్కన
పెట్టాను. చదివిన వారంతా బాగుంది అని చెప్పినా అలాగే చెప్తారు అనుకున్నా.
మా సిస్టర్ ప్రెజర్ చేసే సరికి చదవడం ప్రారంభించాను. కొద్ది పేజీలు
చదివేసరికి ఆ కథలో లీనమయ్యాను. అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మీట్
క్యూట్ అనే స్క్రిప్ట్ మా సిస్టర్ కాకుండా మరెవరు రాసినా ప్రొడ్యూస్
చేసేందుకు ముందుకొచ్చేవాడిని. నాకు స్క్రిప్ట్ ఇచ్చేవారు పోన్ నెంబర్
రాసి వెళ్తారు. అలా రాయకున్నా వాళ్లెవరో వెతికి మరీ ఈ కథను
తెరకెక్కించేవాళ్లం. మీట్ క్యూట్ లో క్యారెక్టర్స్, అవి మాట్లాడుకునే
మాటలు, వాళ్ల మధ్య వచ్చే సందర్భాలు అన్నీ చాలా సహజంగా ఉంటాయి. ఈ కథ
సినిమాకు ఉపయోగపడదు. ఎందుకంటే మనం సినిమాల్లో ఎంత నాచురల్ స్టోరీ
తీసుకున్నా దానికి కొంత డ్రామా కలుపుతాం. ఆ సినిమాటిక్ లిబర్టీ
తీసుకుంటాం. కానీ ఇందులో ఆ పాత్రలు తర్వాత ఎలా ముందుకెళ్తాయి, ఎలా
ముగుస్తాయి అనే ఆసక్తి కలుగుతుంటుంది. నాకు ఇందులో నటించే క్యారెక్టర్
లేదు. సిస్టర్ డైరెక్టర్ కాబట్టి నేను ఖచ్చితంగా అతిథి పాత్రలో
నటిస్తానని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ కథలో అవకాశం లేకుండా
నటిస్తే పేరుకు కనిపించినట్లు ఉంటుంది. ఆంథాలజీ అంటే ఒక్కో కథను
ఒక్కొక్కరు డైరెక్ట్ చేస్తారు. కానీ ఈ కథను తను ఒక్కరే తెరకెక్కించారు. ఈ
సిరీస్ అంతా ప్లెజంట్, ఏదో ఒక మంచి విషయాన్ని, మంచి మాటను ఇది చూశాక
నేర్చుకుంటాం. రోహిణి, ఆకాంక్ష మధ్య వచ్చే సన్నివేశాలు నాకు బాగా
నచ్చాయి. మంచి కంటెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాల్ పోస్టర్ సంస్థ
ద్వారా నిర్మిస్తాం. అన్నారు.

Tags

Related Articles

Back to top button
Close
Close