MOVIE NEWSSpecial Bites

ప‌ద్మ‌శ్రీ అవార్డ్ గ్ర‌హీత డా.విజ‌య్ శంకేశ్వ‌ర్ బ‌యోపిక్ ‘విజయానంద్’… ట్రైలర్ విడుదల

A biopic on life on Padma Shri Dr Vijay Sankeshwar titled Vijayanand Telugu Trailer Out Now

ఎంటైర్ ఇండియాలో అతి పెద్ద‌దైన క‌మ‌ర్షియ‌ల్ వెహిక‌ల్స్ కంపెనీ వీఆర్ఎల్ కంపెనీ వ్య‌వ‌స్థాకుడు.. ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత విజ‌య్ శంకేశ్వ‌ర్ బ‌యోపిక్ ‘విజయానంద్’. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా డిసెంబ‌ర్ 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. శ‌నివారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను బెంగుళూరులో విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించిన విజ‌య్ శంకేశ్వ‌ర్‌… దేశంలోనే అతి పెద్ద‌దైన క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల కంపెనీని అధినేత‌గా ఎదిగిన ప్ర‌యాణంలో ఆయ‌న ఎదిగిన తీరు.. ఆయ‌నకు ఎదురైన స‌వాళ్లు.. బాధ‌లు వాటిని ఆయ‌న అధిగ‌మించిన తీరు అన్నింటినీ చ‌క్క‌గా చూపించారు. ప్రేక్ష‌కుడు సినిమాలో ఎలాంటి అంశాల‌ను ఉండాల‌ని కోరుకుంటాడో, అలాంటి ఎలిమెంట్స్‌ను క‌ల‌గలిపి సినిమాను రూపొందించారు. లెగ‌సీని ముందుకు న‌డిపించిన వ్యక్తిగానే కాకుండా బిజినెస్ టైకూన్‌గా మారిన‌ స్ఫూర్తిదాయ‌క‌మైన ప్ర‌యాణాన్ని కూడా ట్రైల‌ర్‌లో చూపించారు.

అద్భుత‌మైన బ్యాగ్రౌండ్ స్కోర్‌, ఎక్స్‌ట్రార్డిన‌రీ విజువ‌ల్స్ ప్రేక్ష‌కుల‌కు చాలా పెద్ద ప్ర‌భావాన్ని చూపాయి. నిహాల్ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌ను అందించి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు.

విజయానంద్ చిత్రంలో టైటిల్ పాత్ర‌ను నిహాల్ రాజ్‌పుత్ పోషించారు. విజ‌య్ శంకేశ్వ‌ర్ తండ్రి పాత్ర బి.జి.శంకేశ్వ‌ర్‌గా ప్ర‌ముఖ న‌టుడు అనంత నాగ్ న‌టిన‌టించారు. విజ‌య్ భార్య పాత్ర‌ధారిగా సిరి ప్ర‌హ్లాద్‌..కుమారుడు ఆనంద్‌గా భ‌ర‌త్‌ బోప‌న న‌టించారు. వీరితో పాటు వి.ర‌విచంద్ర‌న్‌, షైన్ శెట్టి, అర్చ‌న కొట్టిగే, విన‌య ప్ర‌సాద్ త‌దితరులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

వి.ఆర్‌.ఎల్ సంస్థ వి.ఆర్‌.ఎల్‌.ఫిలింస్ సంస్థ‌ను  స్థాపించి విజ‌యానంద్ పేరుతో తొలి చిత్రాన్ని భారీగా తెర‌కెక్కించింది. రిషికా శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ శంకేశ్వ‌ర్ ఈ సినిమాను నిర్మించారు. కీర్త‌న్ పూజారి సినిమాటోగ్ర‌ఫీతో ఎడిటర్‌గా వ‌ర్క్ చేసిన ఈ చిత్రానికి జాతీయ అవార్డ్ గ్ర‌హీత గోపీ సుంద‌ర్ సంగీతాన్ని అందించారు.

A biopic on life on Padma Shri Dr Vijay Sankeshwar titled Vijayanand Telugu Trailer Out Now

‘Vijayanand’, the biopic on Padma Shri awardee Vijay Sankeshwar, the founder and owner of the largest fleet of commercial vehicles in the country, is all set to release across the country on December 9. Today makers launched the trailer in a grand event at Bengaluru.

The trailer depicted Vijay Sankeshwar’s struggle, pain, and effort. He is well-known for his eventful journey from humble beginnings to becoming the owner of the country’s largest commercial vehicle fleet. It’s jam-packed with intriguing elements that show not only his path to leading a legacy, but also the inspiring journey he took to become a business tycoon.

The brilliant background score, combined with stunning visuals, has a huge impact on the audience. Nihal’s powerful dialogues, delivered with conviction, impressed everyone.

‘Vijayanand’ is a rags to riches story starring Nihal Rajput in the lead title role, The film has Anant Nag in the role of Vijay’s father BG Sankeshwar, Siri Prahlad as his wife, Lalitha and Bharath Bopanna as his son Anand. The film also stars V Ravichandran, Shine Shetty, Archana Kottige, Siri Prahlad and Vinaya Prasad in pivotal roles.

The film marks the production debut of VRL Films. The film is produced by Anand Sankeshwar and directed by Rishika Sharma. Keertan Poojary is the director of photography, and Gopi Sundar is the composer of the music.

The music of the film has been composed by national award-winning composer Gopi Sundar, while Keertan Poojary and Hemanth have done cinematography and editing, respectively.

Tags

Related Articles

Back to top button
Close
Close