MOVIE NEWSSpecial Bites

కెఆర్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్, కార్తీక్ రాచపూడి, కిగోర్ ‘వార్మెన్ బేస్ 51’ ఫస్ట్ లుక్ విడుదల

KR Media and Entertainments, Karthik Rachapudi, Kigor Release 'Warmen Base 51' First Look

కెఆర్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నూతన నటుడు కార్తీక్ రాచపూడిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ కిగోర్ దర్శకత్వంలో ఆర్. మాధురీ రావు నిర్మిస్తున్న వార్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వార్మెన్ బేస్ 51’. సంయుక్త గాలి కథానాయికగా  నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ లో కార్తీక్ రాచపూడి వార్ ఫీల్డ్ లో సోల్జర్ గా కనిపించారు. కండలు తిరిగిన దేహంతో, వార్ జాకెట్ ధరించి చేతిలో గన్ తో యుద్ధభూమిలో కదలిరావడం ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ చిత్రంలో హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు వుండబోతున్నాయని అర్ధమౌతోంది.

భాను చందర్, విశ్వ, జై, అదితి తివారీ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రిబిన్ రిచర్డ్ సంగీతం అందిస్తుండగా, కిగోర్ డీవోపీగా, పి.వి. రామాంజనేయ రెడ్డి ఎడిటర్ గా పని చేస్తున్నారు.

నటీనటులు : కార్తీక్ రాచపూడి, సంయుక్త గాలి, భాను చందర్, విశ్వ, జై, అదితి తివారీ తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: కిగోర్
నిర్మాత: ఆర్. మాధురీ రావు
బ్యానర్: కెఆర్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: రిబిన్ రిచర్డ్
స్టంట్స్ : రబిన్ సుబ్బు
ఎడిటర్: పి.వి. రామాంజనేయ రెడ్డి
డీవోపీ: కిగోర్
ఆర్ట్: రఘు కులకర్ణి
లిరిక్స్: కృష్ణకాంత్
పీఆర్వో : వంశీ శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close