MOVIE NEWSSpecial Bites

ప్రేక్షకులంతా సినిమా నచ్చిందంటున్నారు – నచ్చింది గాళ్ ఫ్రెండూ సినిమాసక్సెస్ మీట్ లో చిత్రబృందం

Nachhindhi girl friendoo success meet

ఉదయ్‌ శంకర్‌, జెన్నీ హీరో హీరోయిన్లుగా నటించిన కొత్త సినిమా ‘నచ్చింది
గాళ్ ఫ్రెండూ’. ఈ చిత్రాన్ని శ్రీరామ్‌ మూవీస్ పతాకంపై అట్లూరి ఆర్‌
సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించారు. గురు పవన్‌ దర్శకత్వం
వహించారు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విజయోత్సవ
కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్‌ లో  నిర్వహించారు.

ఈ సందర్భంగా
నిర్మాత అట్లూరి నారాయణ రావు మాట్లాడుతూ…మా సినిమాకు ప్రేక్షకుల నుంచి
మంచి స్పందన వస్తోంది. చిన్న చిత్రమైనా వైవిధ్యమైన కథా కథనాలతో
రూపొందించారనే పేరు వచ్చింది. హైదరాబాద్‌లో ప్రదర్శలు పెంచుతున్నాం.
సపోర్ట్ చేసిన మీ అందరికీ థాంక్స్‍. అన్నారు.

దర్శకుడు గురు పవన్‌ మాట్లాడుతూ…చిన్న సినిమాను పెద్ద హిట్‌ చేసిన
ప్రేక్షకులకు ధన్యవాదాలు. అన్ని కేంద్రాల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఆద్యంతం సినిమా ఆసక్తికరంగా సాగిందని, చివరి పది నిమిషాలు మమ్మల్ని
కట్టిపడేశావు అంటున్నారు. థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాల్సిన చిత్రమిది. ఆ
థ్రిల్‌ ఫీలింగ్‌ ఓటీటీలో చూస్తే రావు. అన్నారు.

హీరోయిన్‌ జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ మాట్లాడుతూ….తెలుగులో నా తొలి
చిత్రమిది. ఈ చిత్రంలో నేను చేసిన సంధ్య పాత్ర బాగుందని చెబుతున్నారు.
పర్మార్మెన్స్‍తో పాటు గ్లామర్‌ చూపించే క్యారెక్టర్‌ చేయడం సంతోషంగా
ఉంది. ఎంగేజింగ్‌ థ్రిల్లర్‌గా పేరొచ్చిన మా సినిమాను చూస్తారని
ఆశిస్తున్నాను. అని చెప్పింది.

హీరో ఉదయ్‌ శంకర్‌ మాట్లాడుతూ…కంటెంట్‌ బాగుంటే చిన్న చిత్రాన్నైనా
ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. సినిమా ప్రారంభమైన ఐదు
నిమిషాల నుంచే కథలో లీనమవుతున్నారు. థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‍ బాగున్నాయని
అంటున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల కష్టానికి ఫలితం దక్కింది.
సినిమా విడుదలైన అన్ని చోట్లా షోస్ పెంచుతున్నాం. అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.

Tags

Related Articles

Back to top button
Close
Close