
మరింతగా మీ అభిమానం సంపాదించుకుంటా -యువ హీరో సంతోష్ శోభన్
Santosh Shobhan: Like Share Subscribe Is One Of Most Special Films In My Life

ఇంట్రెస్టింగ్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ఆడియెన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక
గుర్తింపు తెచ్చుకున్నారు యువ హీరో సంతోష్ శోభన్. గోల్కొండ హైస్కూల్
చిత్రంతో తెరంగేట్రం చేసిన సంతోష్..తను నేను చిత్రంతో కథానాయకుడిగా
అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ప్రతిభ గల నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
ప్రతిభావంతుడైన యువ హీరోగా అందరి మెప్పు పొందడం సంతోష్ శోభన్ కున్న
అడ్వాంటేజ్. పేపర్ బాయ్ తో క్రిటికల్ అక్లైమ్ తెచ్చుకుని, ఏక్ మినీ కథ,
మంచి రోజులు వచ్చాయి సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. ఇటీవల
లైక్ షేర్ సబ్ స్క్రైబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంతోష్
శోభన్…మరోసారి డిఫరెంట్ అటెంప్ట్ చేశారనే పేరు తెచ్చుకున్నారు.
తాజాగా సంతోష్ శోభన్ సోషల్ మీడియా ద్వారా భావోద్వేగ పోస్ట్ చేశారు.
అందులో ఆయన స్పందిస్తూ…నేను 2010లో తొలిసారి కెమెరా ముందుకొచ్చాను. నా
ఫేవరేట్ డైరెక్టర్ ఇంద్రగంటి దర్శకత్వంలో గోల్కొండ హైస్కూల్ చిత్రంలో
నటించాను. ఈ సినిమాలో నా డైలాగ్స్ చెప్పినప్పుడు ఉద్వేగానికి లోనయ్యాను.
నేను నా కలను సాకారం చేసుకున్న అనుభూతి కలిగింది. ఇక అప్పటి నుంచి నేను
ఎప్పుడు కెమెరా ముందుకొచ్చినా నా డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకుంటున్నానని
ఆనందపడుతుంటా. ఇదే ఆనందాన్ని నిత్యం పొందేందుకు మంచి కథల్లో నటిస్తూ,
మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయాలనుకుంటున్నాను. నా లేటెస్ట్ మూవీ లైక్ షేర్
సబ్ స్క్రైబ్ కు మీరు చూపించిన ఆదరణ, మా వెంట మీరున్నారనే
ధైర్యాన్నిచ్చింది. నా సోదరుడు దర్శకుడు మేర్లపాక గాంధీ, నాయిక ఫరియా
అబ్దుల్లా ఇతర కాస్ట్ అండ్ క్రూ అందరికీ నా కృతజ్ఞతలు చెబుతున్నా.
అన్నారు.
సంతోష్ శోభన్ ప్రస్తుతం ప్రేమ్ కుమార్ అనే సినిమాతో పాటు యూవీ
క్రియేషన్స్ లో రెండు ప్రాజెక్ట్స్ లకు ప్లానింగ్ జరుగుతోంది. ఒక సినిమా
ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయి రిలీజ్ కు రెడీ గా ఉండగా,మరో సినిమా
షూటింగ్ దశలో ఉంది. అలాగే స్వప్న సినిమా పతాకంపై ప్రియాంక దత్ నిర్మాణంలో
నందినీరెడ్డి దర్శకత్వంలో “అన్ని మంచి శకునములే” అనే సినిమాలో సంతోష్
శోభన్ నటిస్తున్నారు.


Santosh Shobhan: Like Share Subscribe Is One Of Most Special Films In My Life
Young and talented hero Santosh Shobhan was recently seen in a comedy
caper, Like Share Subscribe which is directed by Merlapaka Gandhi.
Following the release, he has shared an emotional note.
“The first time I faced the camera was back in March of 2010 as I
delivered my first lines with incredible Mohan Krishna Indraganti
calling the cut. That day my dream came true and I can never take it
for granted.” Santosh said.
“Like Share Subscribe is one of the most special films of my life as
it was made with a lot of love and good intentions. It’s my second
collaboration with brother/director, Merlapaka Gandhi and first of
many with the Amazon Faria Abdullah. I would like to thank Sudarshan,
Brahmans sir, Mirchi Kiran, our DOP Vasanth, music directed Pravin and
Ram: and the entire cast and crew of film who worked ever so hard to
make it happen.”