MOVIE NEWS

స్టార్ డైరెక్టర్ బాబి చేతుల మీదుగా ఆది సాయికుమార్ “సీఎస్ఐ సనాతన్” టీజర్ విడుదల

Aadi Saikumar's "CSI Sanathan" teaser was released by star director Bobby

చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “సీఎస్ఐ సనాతన్”. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ ఐ) ఆఫీస‌ర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్ గా
రూపొందుతున్న “సీఎస్ఐ సనాతన్” సినిమా టీజర్ ను తాజాగా ప్రముఖ దర్శకుడు బాబి విడుదల చేశారు. టీజర్ బాగుందన్న ఆయన చిత్ర బృందానికి విశెస్ తెలిపారు.

ఈ టీజర్ ఎలా ఉందో చూస్తే…విక్రమ్ అనే ప్రముఖ పారిశ్రామికవేత్త యువకుడి హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్ సీన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ ఇంటెన్స్ పర్మార్మెన్స్ చూపించారు. ఒక హత్య జరిగిందంటే హంతకుడు తప్పకుండా ఉంటాడు. ఐదుగురు అనుమానితులు ఐదు డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తున్నారు. వాటిలో ఏది నిజం అనేది ఆయన విచారణలో తెలుసుకునే క్రమం ఆసక్తిగా ఉండనుంది. నౌ ద రియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్స్ అనే డైలాగ్ తో టీజర్ ఇంట్రెస్టింగ్ గా ముగిసింది.

తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం తెలిపారు.

న‌టీ న‌టులు – ఆదిసాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాక‌ర్ పొన్న‌ప్ప ,మ‌ధు సూద‌న్, వాసంతి తదితరులు

సాంకేతిక వ‌ర్గం – ,
సినిమాటోగ్ర‌ఫీ ః జిశేఖ‌ర్,
మ్యూజిక్: అనీష్ సోలోమాన్,
పిఆర్ఒ ః జియ‌స్ కె మీడియా,
నిర్మాత ః అజ‌య్ శ్రీనివాస్
ద‌ర్శ‌కుడు ః శివ‌శంక‌ర్ దేవ్

Tags

Related Articles

Back to top button
Close
Close