MOVIE NEWSNEWSSpecial Bites

గవర్నర్ ‘తమిళిసై’ ను  కలిసిన అలీ..  

Ali meet Governor 'Tamilisai'..

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అలీ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ ని కలిశారు. ఈ మధ్యే అలీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. అలీ నేడు తెలంగాణ గవర్నర్‌  తమిళిసై గౌరవప్రదంగా కలిసి ముచ్చటించారు. అలీ పెద్దకూతురు ఫాతిమా వివాహం నిశ్చయమైంది. రీసెంట్ గా ఫాతిమా ఎంగేజ్‌మెంట్‌ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా అలీ వివాహ ఆహ్వాన పత్రిక ప్రతిని  గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కి అందిస్తూ  స్వయంగా వివాహానికి రావాలని  ప్రత్యేకంగా ఆహ్వానించారు. పెళ్లిపత్రిక స్వీకరించిన తమిళిసై కూడా, తప్పకుండా వివాహానికి హాజరు అవుతాను అని అలీకి మాటిచ్చారు.

Tags

Related Articles

Back to top button
Close
Close