MOVIE NEWSTrailersVIDEOS

మాస్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా `గాలోడు`..ట్రైల‌ర్‌కి అదిరిపోయే రెస్పాన్స్‌.

Mass and Action Entertainer Gaalodu to Release WorldWide on November 18

సుడిగాలి సుధీర్‍‍‍‍ హీరోగా న‌టిస్తోన్న ప‌క్కా మాస్అండ్‌యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. టైటిల్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టినుండే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొని ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, సాంగ్స్‌కి విశేష ఆద‌ర‌ణ ల‌భించింది. తాజాగా `గాలోడు` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌..

దాదాపు రెండున్న‌ర నిమిషాల నిడివిగ‌ల ఈ ట్రైలర్‌తో సినిమా ఎలా ఉండ‌బోతుందో ముందే హింట్ ఇచ్చారు మేక‌ర్స్.. ఫ‌స్ట్ టైమ్ సుధీర్ మాస్‌లుక్‌లో చేసే యాక్ష‌న్ ఎపిసోడ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఒక‌వైపు మాస్ లుక్‌లో ఆక‌ట్టుకుంటూనే మ‌రోవైపు స్టైలీష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు సుధీర్. ఇక “వ‌య‌సు త‌క్కువ `షో`లు ఎక్కువ‌, నువ్వు శ‌నివారం పుట్టావా? శ‌నిలా త‌గులుకున్నావ్‌, రామాయ‌ణంలో ఒక్కటే మాయ లేడీ ఇక్క‌డ అంద‌రు మాయ లేడీలే..వంటి డైలాగ్స్‌లో ఎంట‌ర్‌టైన్ చేస్తూనే `వాడిది మామూలు రేంజ్ కాదు మాఫియా రేంజ్, సైనైడ్, యాసిడ్ కంటే డేంజ‌ర్‌రా వాడు, రాక్ష‌సుల గురించి పుస్త‌కాల్లో చ‌దివాను, విన్నాను మొట్ట‌మొద‌టి సారి వీడిలో చూశాను సార్` వంటి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచానాల్ని రెట్టింపు చేశాయి. గెహ్నాసిప్పి గ్లామ‌ర్‌, స‌ప్త‌గిరి కామెడీ టైమింగ్ ట్రైల‌ర్‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లుగా నిలిచాయి. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ సి. రాంప్ర‌సాద్ విజువ‌ల్స్, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్ట్ లెవ‌ల్‌లో ఉన్నాయి.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా `గాలోడు` సినిమా న‌వంబ‌రు 18న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి, స‌ప్త‌గిరి, పృథ్విరాజ్, శ‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య క్రిష్ణ‌  త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్ర‌ఫి: సి రాం ప్ర‌సాద్‌
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బిక్ష‌ప‌తి తుమ్మ‌ల‌
స‌మ‌ర్ప‌ణ‌: ప్రకృతి
బేన‌ర్‌: సంస్కృతి ఫిలింస్‌,
ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం: రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల‌.
Mass and Action Entertainer Gaalodu to Release WorldWide on November 18

Gaalodu is a solid mass and action entertainer starring Sudigali Sudheer and Gehna Sippy. This film is directed by Rajasekhar Reddy Pulicharla. The movie is bankrolled by Samskruthi Films.

Ever since the title was announced, there have been huge expectations for this movie. The teaser and songs that have already been released have received a lot of attention. The film unit has recently released the theatrical trailer of ‘Gaalodu’.

The makers have already given a hint of how the movie is going to be with this trailer which is about two and a half minute Duration.

The action episodes in Sudheer’s first time mass look are amazing. On the other hand, Sudheer impressed the fans with his stylish looks.

Saptagiri comedy timing are the additional attractions of the trailer. Famous cinematographer C. Ramprasad Visuals, and talented music director Bheems songs, background score are next level.

 The movie “Gaalodu” is going to release on November 18 worldwide.

Cast: Sudigali Sudheer, Gehna Sippy, Saptagiri, Pritviraj, Shakalaka Shanker, Sathya Krishna and others

Cinematography: C Ram Prasad
Music: Bheems Ceciroleo
Production Controller: Bikshapathi Thummala
Presented by: Prakruthi
Banner: Samskrithi Films
Director: Rajashekhar Reddy Pulicharla

Tags

Related Articles

Back to top button
Close
Close