
ప్రమాదంలో పవన్ కళ్యాణ్ ?

గుజరాత్ కు చెందిన వాహనంలో రెక్కీ కు వచ్చినట్లు సమాచారం
GJ 21AH 1905 కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు


పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు
హైదరాబాదు లో పవన్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీగా అనుమానం
నాదెండ్ల మనోహర్
విశాఖ సంఘటన తరువాత పవన్ కళ్యాణ్ గారి ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులు తచ్చాడుతున్నారు.
ఆయన ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వాహనాన్ని అనుసరిస్తున్నారు.
కారులోని వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
అనుసరిస్తున్నవారు అభిమానులు ఎంత మాత్రం కాదు
పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత రక్షణ సిబ్బంది ఇదే చెబుతున్నారు.
వారి కదలికలు అనుమానించే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం కారులోనూ, మంగళవారం నాడు ద్విచక్రవాహనాలపై అనుసరించారు.
సోమవారం అర్దరాత్రి కూడా ముగ్గురు వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారు.
ఇంటికి ఎదురుగా వారు కారు ఆపారు.
సెక్యూరిటీ సిబ్బంది నివారించబోగా బూతులు తిడుతూ,
పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడుతూ గొడవ చేశారు.
సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు.
ఆయినా సిబ్బంది సంయమనం పాటించారు
ఈ సంఘటనను వీడియో తీసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు పిర్యాదు చేశారు.