MOVIE NEWS

నవంబర్ 11న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలవుతున్న మూవీ “ఇన్ సేక్యూర్”.

The movie "In Secure" is releasing grandly in theaters on November 11.

 ఆర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలో
సిహెచ్  క్రాంతి కిరణ్ సహకారం తో అదిరే అభి ( అభినవ కృష్ణ ) ఆమీక్షా పవార్,ప్రగ్య నాయన్, సోనాక్షి వర్మ హీరో హీరోయిన్లుగా సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సస్పెన్స్ త్రిల్లర్ చిత్రం  “ఇన్ సేక్యూర్” నవంబర్ 11న గ్రాండ్ గా విడుదలవుతుంది.
                      ఈ సందర్భంగా దర్శక నిర్మాత సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ … తప్పు చేసి డబ్బు హోదాను అడ్డుపెట్టుకుని చట్టం నుండి ఎలాగైనా తప్పించుకోవచ్చు అనే చెడు ఆలోచనను దూరం చేసే ప్రయత్నగా “ఇన్ సేక్యూర్” మూవీని నిర్మించాం ఈ చిత్రంలో కీలక పోలీస్ పాత్రలో “సీతారామం” ఫేమ్ మధు నంబియర్, నటించగా ప్రముఖ ప్రొడ్యూసర్ రాజేష్ నాయుడు మరో కీలక పాత్రలో నటించారు, నవంబర్ 11న
థియేటర్లలో గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ చిత్రం మా బ్యానర్లో నాలుగో చిత్రం గతంలో నందికొండవాగుల్లోన , మోని , స్టూవర్టుపురం చిత్రాలు నిర్మించాం  గత చిత్రలాగానే ఈచిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు


                         ఈ చిత్రానికి సంగీతం : నవనీత్ చారి ,సమర్పణ: రంజిత్ కోడిప్యాక , సహకారం : సిహెచ్  క్రాంతి కిరణ్ , పాటలు : బస్వాగాని భాస్కర్ , మాటలు : శిల్ప కసుకుర్తి , నిర్మాత, దర్శకత్వం : సత్యనారాయణ ఏకారి

RK.Chowdary  PRO  9848623335

Tags

Related Articles

Back to top button
Close
Close