MOVIE NEWS

*డిసెంబర్ 23న విడుదల కానున్న నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ “18 పేజీస్”*

*Nikhil, Anupama Parameswaran's "18 Pages" to release on December 23*

ఫైనల్ షెడ్యూల్  కి హాజరైన నిఖిల్

ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ మరియు అనుపమ పరమేశ్వరన్ మరోసారి 18 పేజీస్ సినిమాకి  జతకట్టారు. ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ని పుష్ప దర్శకుడు సుకుమార్ రాశారు. ఇదే కాకుండా గతంలో  కుమారి 21 ఎఫ్ చిత్రానికి కూడా కథను అందించారు.
అతని  శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ 18 పేజిస్ సినిమాను సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి GA2 పిక్చర్స్‌పై బన్నీ వాస్ నిర్మించారు.

ప్రస్తుతం ఈ సినిమా తుది దశకు చేరుకుంది. కొంచెం విరామం తర్వాత, నిఖిల్ 18 పేజీస్ సెట్‌కి తిరిగి వచ్చారు. మరియు 18 పేజీస్ చివరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది, చిత్రీకరణ కూడా అద్భుతంగా కొనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

సినిమాటోగ్రాఫర్ ఎ వసంత్ విజువల్స్ సినిమా ఫీల్ గుడ్ వైబ్‌ని పెంచాయి. 18 పేజీస్ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ వర్క్ చేస్తున్నారు. ప్రముఖ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

తారాగణం: నిఖిల్ సిద్దార్థ & అనుపమ పరమేశ్వరన్

స్క్రీన్ ప్లే & దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్

కథ: సుకుమార్

ప్రొడక్షన్: GA2 పిక్చర్స్ & సుకుమార్ రైటింగ్స్

నిర్మాత: బన్నీ వాస్

సంగీతం: గోపీ సుందర్

సినిమాటోగ్రఫీ: వసంత్

ఎడిటర్: నవీన్ నూలి

ఆర్ట్ డైరెక్టర్: రమణ వంక

ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శరణ్ రాపర్తి (గీతా ఆర్ట్స్)

రచయిత: శ్రీకాంత్ విస్సా

లైన్ ప్రొడ్యూసర్: బాబు

పిఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, మేఘ శ్యామ్

Thanks & Regards,
Eluru Sreenu
P.R.O

Tags

Related Articles

Back to top button
Close
Close