MOVIE NEWS

Prabhas nail’s Lord Ram’s look in the recently released poster from Adipurush !

Prabhas nail's Lord Ram's look in the recently released poster from Adipurush !

On the occasion of his  birthday, the makers of Adipurush released an enchanting image of Prabhas as Lord Ram. An ideal Ram ki Chavi, Prabhas is the perfect embodiment of Lord Ram. The poster was revealed via social media on 23rd October, Prabhas’ birthday.

The team behind the magnum opus film, Adipurush namely director Om Raut and Producer Bhushan Kumar and UV Creations, are proud of the fact that Prabhas, one of the most hardworking and diligent actor’s today, is a flawless composition of all the celestial qualities of Lord Ram. The poster is a testament of the same!

Happy Birthday Prabhas – Team Adipurush !

రావణ సంహారానికి కదిలిన రాఘవుడు, ప్రభాస్ పుట్టినరోజున “ఆది పురుష్” నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ఆది పురుష్ నుంచి స్పెషల్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేశారు. సీతమ్మను అపహరించిన రావణ సంహారం జరగాల్సిందేనని ప్రతిజ్ఞ చేసిన రాఘవుడు వానర సైన్యంతో కలిసి లంకపై దండెత్తిన అపూర్వ దృశ్యాన్ని గుర్తుచేసిందీ పోస్టర్. ఈ పోస్టర్ లో రాముడిగా పోతపోసినట్లు ప్రభాస్ కనిపించారు. రణక్షేత్రం వైపు దృష్టి సారించే ఆ చూపులు, లక్ష్యం వైపు వడిగా పడే ఆ అడుగులు, శత్రువును చీల్చేందుకు సిద్ధమైన విల్లంబులతో రాముడి కార్యదీక్షను ప్రభాస్ తన ఆహార్యంలో అద్భుతంగా చూపించారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆది పురుష్ నుంచి విడుదల ఈ లుక్ అభిమానులను అలరిస్తోంది. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో  ట్రెండింగ్ అవుతోంది.

ఆదిపురుష్ చిత్రాన్ని పౌరాణిక గాథ రామాయణం నేపథ్యంతో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోపైల్స్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో భాగమయ్యారు. కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఐమాక్స్, త్రీడీ పార్మేట్ లో వచ్చే సంక్రాంతి పండక్కి జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

Tags

Related Articles

Back to top button
Close
Close