MOVIE NEWS

హ్యాపీ బర్త్ డే టు ప్యాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్

Wishing A Happy Birthday to Pan India Superstar Prabhas

ఒకప్పటి తెలుగు సినిమా అంటే కమర్షియల్ చిత్రాలకి, అడపాదడపా వచ్చే ఫ్యామిలీ చిత్రాలకు మాత్రమే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండేది. వంద కోట్ల రూపాయల వసూళ్లు కష్టంగా దాటే తెలుగు చిత్రాల పరిస్థితి ని పూర్తిగా మార్చేస్తూ నేటి తెలుగు దర్శకులు, ఈతరం నటులు అంతర్జాతీయ స్థాయిలో కలలు కనే ధైర్యం ఇచ్చింది ఒక చిత్రం. కేరీర్ లో సక్సెస్ తో ఉన్న అతి ముఖ్యమైన అయిదేళ్ళని ఆ చిత్రానికి అంకితం చేసి తెలుగుపరిశ్రమ గుర్తింపుని బాక్సాఫీస్ రూపు రేఖలని మార్చేశారుఒక హీరో. ఆ హీరో ‘ప్రభాస్’, ఆయన నటించిన ఆ సినిమా బాహుబలి.

ఒకప్పుడు కృష్ణుడు, రాముడు అంటే ఎన్టీఆర్ గుర్తొచ్చేవారు, తెరపై ఆయన ఆహార్యం అలాంటిది. అలా ఆరడుగుల ఎత్తు, గంభీరమైన స్వరం, కండలు తిరిగిన దేహంతో, అమరేంద్ర బాహుబలిలా ప్రభాస్ ఠీవిగా నడిచి వస్తుంటే, రాజంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 2000 కోట్ల కలెక్షన్, కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆ కటౌట్ కి మైనపు ప్రతిమను బ్యాంకాక్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రతిష్టించారు.

నిర్మాతగా ఉన్న తండ్రి సూర్య నారాయణ రాజు, హీరోగా చేసిన పెద్దనాన్న కృష్ణం రాజు తర్వాత వారసుడిగా ఈశ్వర్ తో పరిశ్రమలోకి అడుగుపెట్టి వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి, సాహో లాంటి భారీ విజయాలని సాధిస్తూ ప్రభాస్ 20 ఏళ్ళలో ప్రతి చిత్రానికి చాలా కష్టపడుతూ, తనని తాను ఎప్పటికప్పుడు కొత్తగా మలుచుకుంటూ, రెబెల్ స్టార్ నుండి పాన్ ఇండియన్ స్టార్ స్థాయిని దాటి అంతర్జాతీయ అభిమానులని గెలుచుకున్నాడు. అసలు ప్రభాస్ లేకపోతే బాహుబలి చిత్రమే లేదు అని దర్శధీరుడు రాజమౌళి స్వయంగా అన్నారంటే అతని డెడికేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

20 ఏళ్ళ పాటు ప్రేక్షకుల హృదయాల్లో మకుటం లేని మహారాజులా ఎదుగుతూ, దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయికి వచ్చినా కూడా ఏ మాత్రం గర్వం లేకుండా తన సహ నటులతో మిగతా బృందంతో ఆప్యాయంగా ‘డార్లింగ్‌’ అని పిలుస్తూ పిలిపించుకుంటూ ఉంటారు ప్రభాస్‌. తన కేరిర్ లో ఎలాంటి కాంట్రవర్సీ జోలికి పోకుండా తనతో పని చేసిన దిగ్గజ నిర్మాతలు, దర్శకులు మళ్ళీ మళ్ళీ తనతో పని చేయాలనిపిస్తుంది అని చెప్తున్నారంటే నటుడిగా తన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్ధమవుతుంది.

ప్రస్తుతం ప్రభాస్ చిత్రం కోసం టాలీవుడ్ బాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. నేషనల్ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. వాల్మీకి రామాయణంలో రాముడి వర్ణన కి తగ్గట్టుగా ఉండే ఆహార్యం సహజంగానే ఉన్న ప్రభాస్ ఇందులో రాఘవ రాముడిగా కనిపించనుండగా పూర్తి 3డి టెక్నాలజీ తో 250 కోట్ల విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం కనిపించనుంది.

అలాగే కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ హీరోగా డార్క్ సెంట్రిక్ థీం టెక్నాలజీ ని వాడుతూ తెరకెక్కుతున్న ఇండియాలో మొట్ట మొదటి భారీ చిత్రం ‘సలార్’. ఇందులోని యాక్షన్, విజువల్స్ ఇదివరకెన్నడూ చూడని స్థాయిలో ఉంటాయని చిత్రంలో నటించిన నటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు చెప్పడం విశేషం.

వైజయంతి మూవీస్ లాంటి ప్రఖ్యాత నిర్మాణ సంస్థలో దాదాపూ 500 కోట్ల బడ్జెట్ తో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కె’ పై విపరీతమైన అంచనాలున్నాయి. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లాంటి పాన్ ఇండియన్ నటులు ఇందులో భాగమవుతుండగా, మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ తోడవ్వడం తో ఈ చిత్రానికి ప్రపంచ దేశాల్లో భారీ మార్కెట్ దక్కనుంది.

ఇది కాక అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తోనూ దర్శకుడు మారుతి తో కూడా భారీ చిత్రాలు త్వరలో మొదలవ్వనున్నాయి.

గత 20 ఏళ్లు గా ప్రభాస్ ఎన్నో సేవా సహాయ కార్యక్రమాలు చేసాడు. వరదలు వచ్చినపుడు, కోవిడ్ సమయంలోనూ ఎన్నో భారీ విరాళాలు ఇచ్చారు. అలాగే 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకోవడమే కాక అందులో తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ అభివృద్ధి కి కావలసిన ఎన్నో సౌకర్యాలు సమకూర్చారు. ఇలా రెబల్ స్టార్ గా మాత్రమే కాక మంచి మనసున్న మహారాజుగా అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రభాస్‌ మరెన్నో అద్భుత విజయాలు సాధించాలని అక్టోబర్‌ 23న పుట్టినరోజు సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు.

Wishing A Happy Birthday to Pan India Superstar Prabhas

Often we saw a star growing to fame beyond language barriers in India
but now we see a South Actor becoming the face of Indian cinema. With
sheer commitment, passion and hardwork, Prabhas has excelled in
attaining a global superstardom in no time.

He’s one of the highest paid actors in Indian Cinema now and yet has
zero controversies and haters. He’s called as Darling  by fans and
fellow actors and technicians for the noble and kind heart he has.
He’s friends with almost every actor and actress in Industry and
treats everyone with love.

Making 20+ films in 20 years of his career, he won the hearts of
masses, family audience and the classic film lovers with Varsham,
Chatrapathi, Billa, Darling, Mr. Perfect, Pournami and Mirchi.

His body, look and style transformation has flourished as trend in the
youth for years. He recieved national wide applause, awards and
acclaim throughout his career.

It’s an undisputed statement to say that Prabhas is possibly the only
Indian actor who has the aura and demeanor to play a King. This was
evident when he played Amarendra/Mahendra Baahubali in the Magnum Opus
Baahubali.

We rarely see a successor taking the legacy of the legends forward
while also making his mark walking in their foot prints. He debuted
carrying the fame of his uncle legendary actor Krishna Raju’s legacy
yet blended himself as a commendable actor to deserve all the acclaim
of his own.

The Starmaker of the decade, maverick director SS Rajamouli himself
said that only Prabhas can play Baahubali and if not for him the
project would not begin at all. They even made the Mass blockbuster
Chatrapathi which was then remade in many languages but no one could
roughly reach the screen presence of Prabhas.

The star hero will soon be seen as Lord Sri Rama in Adipurush which is
announced for release on the 12th of January, 2023. The film is
mounted on a budget of 500 crores which has 250Cr only for VFX.
Directed by national award winner Om Raut, it was entirely shot in 3D.

Then comes Salaar, India’s first film with dark centric theme
technology. This film is directed by KGF fame Prashanth Neel and it is
one of the biggest commercial films that are in the making in Indian
cinema. It is sure to take the mass centers by storm as it releases in
theatres on the 28th of September, 2023.

Prabhas has also lined up Project K which is the costliest project in
Indian cinema. It is based on futuristic vision and is expected to
take Prabhas to worldwide fame. Directed by Mahanati fame Nag Ashwin
this movie stars Amitabh Bachchan and Deepika Padukone.

Also, there’s Spirit directed by Sandeep Reddy Vanga, the man behind
Arjun Reddy. This is going to be one of the craziest projects in
Indian cinema.

Prabhas is also known for his large-hearted philanthropic activities.
He adopted 1650actres of Khajipalli Reserve Forest and contributed to
the ecosystem. He also carries out several social service activities
anonymously. On the occasion of his birthday on October 23rd, here’s
wishing the superstar a happy birthday and many more to come.

Tags

Related Articles

Check Also

Close
Back to top button
Close
Close