MOVIE NEWS

‘హర హర మహాదేవ్’ పోస్టర్‌ను రిలీజ్ చేసిన కింగ్ అక్కినేని నాగార్జున – Superstar Akkineni Nagarjuna releases the poster of Har Har Mahadev in Hyderabad

Superstar Akkineni Nagarjuna releases the poster of Har Har Mahadev in Hyderabad

పాన్ ఇండియన్ సినిమాగా హర హర మహాదేవ్ అన్ని భాషల్లో విడుదల కానుంది. ఈక్రమంలో ఈ మూవీ తెలుగు పోస్టర్‌ను హైద్రాబాద్‌లో కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు.

జీ స్టూడియోస్ తెరకెక్కిస్తోన్న హర హర మహాదేవ్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో సుబోధ్ భావే, బాజీ ప్రభు దేశ్‌పాండే పాత్రలో శరద్ కేల్కర్ నటించిన ఈ హర హర మహాదేవ్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరాఠిలో తెరకెక్కించిన ఈ చిత్రం మొదటిసారిగా వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ తెలుగు పోస్టర్‌ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు.

‘జీ స్టూడియోస్, శ్రీ గణేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ పోస్టర్‌ను విడుదల చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ నాగార్జున అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘నా చిన్నతనం నుంచీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఎన్నెన్నో వింటూనే ఉన్నాను. ఆయన ఎంత గొప్ప రాజు.. ఎలా పరిపాలించాడు.. అనేవి వింటూనే పెరిగాను. ఈ కథను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఆయన కథనే కాకుండా.. శివాజీ మహారాజ్ స్నేహితుడైన బాజీ ప్రభు దేశ్‌పాండే కథను కూడా చూపించబోతోన్నారు. లక్షాయాభై వేల సైన్యాన్ని కేవలం 300 యోధులతో ఎలా ఎదుర్కొన్నారో ఇందులో చూపించబోతోన్నారు. నేను ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఐదు భాషల్లో విడుదల అవుతుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడు సినిమాల పరంగా భారతదేశం అంతా ఒక్కటే అయింది. చాలా చిన్నగా అనిపిస్తోంది. భాషాబేధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తున్నారు.  కంటెంట్ బాగుంటే.. అన్ని భాషల ప్రేక్షకులు సినిమాలను విజయవంతం చేస్తున్నారు’ అని అన్నారు.

జీ స్టూడియోస్, శ్రీ గణేష్ మార్కెటింగ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అభిజిత్ దేశ్‌పాండే దర్శకత్వం వహించారు. సుబోధ్ భావే, శరద్ కేల్కర్, అమృతా కాన్విల్కర్, సయాలీ సంజీవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 25న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్దమైంది.

&&&&&&&&&&

Superstar Akkineni Nagarjuna releases the poster of Har Har Mahadev in Hyderabad

As Har Har Mahadev is all set to release all over the nation in different languages, the Telugu poster of the film was recently released by the superstar Nagarjuna in Hyderabad.

ZEE Studios’ upcoming ‘Har Har Mahadev‘ truly took over the nation with its electrifying trailer and power-packed songs. The audience is eagerly waiting to see the characters of Chhatrapati Shivaji Maharaj and Baji Prabhu Deshpande played by Subodh Bhave and Sharad Kelkar in the film. Being the 1st Marathi multilingual film, it will be released in 5 languages across the nation and now the superstar Nagarjuna recently released the poster of the film in Hyderabad.

As ‘Har Har Mahadev‘ is all set to release all over the nation in different languages, the Telugu poster of the film was recently released by the superstar Nagarjuna in Hyderabad. The superstar was seen holding the Telugu poster of the film, where the cast Subodh Bhave, Sharad Kelkar, Sayli Sanjeev along with the director Abhijeet Deshpande were captured along.

While speaking about the film, Nagarjuna said “I am very pleased and happy to launch the poster of Har Har Mahadev, Produced by ZEE Studios and Shri Ganesh Marketing and films.”

He added further, “Since my childhood, I remember reading about Chhatrapati Shivaji Maharaj’s history, what kind of a person, and what kind of king he was, What a benevolent king he was. I’m so happy they are bringing his story to the Telugu people and also about his friend and commander Baji Prabhu Deshpande about his story, their relationship, and how brilliantly Baji Prabhu Deshpande fought so that Chhatrapati Shivaji Maharaj could get into safety and he went against 150000 enemy army just with 300 soldiers and with this he made sure that his king was safe and I am really looking forward to this story and seeing this film. I wish everybody, all the very best to Director Abhijeet Deshpande and the rest of the team. Releasing this in 5 languages is a fantastic thing. Now India has become a smaller place as far as language is concerned, everybody is watching everything everywhere, if the content is good they will like it and I think this is one such content.”

Produced by ZEE Studios, Shri Ganesh Marketing and Films,  and Directed by Abhijeet Deshpande. The film stars Subodh Bhave, Sharad Kelkar, Amruta Khanvilkar, and Sayli Sanjeev in the leads. The film is all set to hit the theatres on 25th October 2022.

Tags

Related Articles

Back to top button
Close
Close