MOVIE NEWS

సింగల్ క్యారెక్టర్‌తో *హలో మీరా.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్* 

First Look Poster Of Single Character Movie Hello Meera Released

ప్రయోగాత్మక కథలను వెండితెరపై ఆవిష్కరించడంలో ఎంతో శ్రమ దాగి ఉంటుంది. ఆసక్తికర కథ, కథనంతో ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో డిఫరెంట్ దారులు వెతుకుతూ తమ తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు కొందరు దర్శకులు. అదే బాటలో తాజాగా ”హలో మీరా” అంటూ ఓ వైవిధ్యభరితమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు. ప్రముఖ దర్శకులు శ్రీ బాపు గారితో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవాన్ని రంగరించి ఈ ”హలో మీరా” సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు కాకర్ల శ్రీనివాసు.   

తొలి సినిమానే తనకు ఎంతో స్పెషల్ కావాలని హలో మీరా కథపై కసరత్తులు చేసి ప్రేక్షకులు వినూత్న అనుభూతి పొందేలా ఆవిష్కరించబోతున్నారు దర్శకుడు కాకర్ల శ్రీనివాసు. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో ఈ ప్రయోగాత్మక  చిత్రాన్ని నిర్మించారు. కేవలం సింగిల్ క్యారెక్టర్ తో సినిమాను నడిపించి థ్రిల్ చేయనుండటం ఈ మూవీ ప్రత్యేకత. సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ గా కథ మొత్తం కూడా మీరా అనే పాత్ర చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు అనుక్షణం సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తుందని మేకర్స్ అంటున్నారు. 

తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్. ఈ పోస్టర్ లో ప్రధాన పాత్ర అయిన మీరాను చూపిస్తూ కథలోని యాంగిల్ ఏంటనేది స్పష్టం చేశారు. మీరా వెనకాల కనిపిస్తున్న ప్రకాశం బ్యారేజ్, ఆకాశంలో పక్షులు ఎగురు తుండటం చూస్తుంటే ఈ సినిమాలో ఊహకందని సస్పెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగే ప్రయాణమే ఈ సినిమా అని.. ఖచ్చితంగా ఇది ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతినిస్తుందని దర్శకుడు కాకర్ల శ్రీనివాసు అంటున్నారు. తెరపై కనిపించే మీరాతోపాటు ఫోన్ కాల్స్ లో వినిపించే  పాత్రలు మరింత ఉత్కంఠ రేపుతాయట. అతి త్వరలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు. సూరి సాధనాల అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు.

డా: లక్ష్మణరావు  దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరించగా.. ఎస్ చిన్న సంగీతం అందించారు. అనంత శ్రీధర్ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. తిరుమల ఎం తిరుపతి పొడక్షన్ డిజైనర్ గా, కత్రి మల్లేష్ , M రాంబాబు [చెన్నై] ప్రొడక్షన్ మేనేజర్స్ గా పని చేశారు. హిరణ్మయి కల్యాణ్ మాటలు రాశారు. రాంబాబు మేడికొండ ఎడిటర్ గా వర్క్ చేశారు. 

కథ ,స్క్రీన్ ప్లే, దర్శకుడు: శ్రీనివాసు కాకర్ల

ప్రొడ్యూసర్స్: డా: లక్ష్మణరావు  దిక్కల, వరప్రసాదరావు దుంపల,  పద్మ కాకర్ల    

మ్యూజిక్: ఎస్ చిన్న 

పొడక్షన్ డిజైనర్: తిరుమల ఎం తిరుపతి 

మేకప్: పి రాంబాబు 

అసోసియేట్ డైరెక్టర్: సూరి సాధనాల 

ప్రొడక్షన్ మేనేజర్స్: కత్రి మల్లేష్ , M రాంబాబు [చెన్నై]

పాటలు: శ్రీ సాయి కిరణ్ 

సింగర్స్:  సమీరా భరద్వాజ్ ,దీపక్ బ్లూ 

సౌండ్ డిజైనర్: శరత్  [సౌండ్ పోస్ట్] 

ఆడియోగ్రఫీ: ఎం  గీత గురప్ప 

పబ్లిసిటీ డిజైనర్: కృష్ణ డిజిటల్స్ 

మాటలు  హిరణ్మయి కళ్యాణ్ 

ఎడిటర్: రాంబాబు మేడికొండ

First Look Poster Of Single Character Movie Hello Meera Released

Hello-Meera
Hello-Meera

It involves a lot of hard work in making experimental movies. Some directors are proving their talent by looking for different ways to thrill the audience with an interesting story and narrative. Likewise, director Kakarla Srinivas is coming up with a unique story with the latest movie ‘Hello Meera’. Kakarla Srinivas, who was the protégé of legendary filmmaker Bapu and has vast experience, is making his directorial debut with the movie.

Kakarla Srinivas wants his first film to be very special, thus he worked intensely on the story to offer a different experience to the audience. Jeevan Kakarla produced this experimental film under the Lumiere Cinema banner. What’s so unique about this movie is it’s going to thrill with a single character. The makers say that the film being made as a suspense drama thriller will give the audience an edge-of-seat experience.

The makers released the first look of the film, on the occasion of Dussehra. The main character Meera looks apprehensive in the poster, whereas we can see Prakasam barrage, and birds which all indicate there will be an unexpected suspense element in the movie. Director Kakarla Srinivas says that this film is an exciting journey and will offer a first-of-its-kind experience to movie buffs. Alongside the character of Meera who appears on the screen, the characters heard in the phone calls also arouse exhilaration. This movie is getting ready for release soon. Gargeyi Yellapragada played the role of Meera in this film. Suri Sadhanala worked as an associate director.

Dr. Lakshmana Rao Dikkala, Varaprasadarao Dumpala and Padma Kakarla produced the movie, while S. Chinna provided the music. Anantha Sridhar is the line producer. Tirumala M Tirupati is the Production Designer, whereas Katri Mallesh, and M Rambabu [Chennai] are the Production Managers. Rambabu Medikonda is the editor.

Story, Screenplay, Direction: Srinivas Kakarla

Producers: Dr. Lakshmana Rao Dikkala, Varaprasadarao Dumpala, Padma Kakarla

Music: S Chinna

Production Designer: Tirumala M Tirupati

Makeup: P Rambabu

Associate Director: Suri Sadhanala

Production Managers: Katri Mallesh, M Rambabu [Chennai]

Lyrics: Sri Sai Kiran

Singers: Sameera Bhardwaj, Deepak Blue

Sound Designer: Sarath [Sound Post]

Audiography: M Geetha Gurappa

Publicity Designer: Krishna Digitals

Dialogues: Hiranmayi Kalyan

Editor: Rambabu Medikonda

Tags

Related Articles

Back to top button
Close
Close