MOVIE NEWS

శివకార్తికేయన్, అనుదీప్ కె.వి, ఎస్వీసి ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ ‘ప్రిన్స్’ అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల

Sivakarthikeyan, Anudeep KV, SVC LLP, Suresh Productions, Shanti Talkies 'Prince' will release on 21st October with a grand worldwide release.

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘ప్రిన్స్’. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం ఇండియాలోని పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో రూపొందుతోంది.  తాజాగా అందరికీ ఆయుధ పూజ శుభాకాంక్షలు చెబుతూ నిర్మాతలు  ప్రిన్స్ విడుదల తేదిని ప్రకటించారు. అక్టోబర్ 21న ప్రిన్స్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో  గ్రాండ్ గా విడుదల కానుందని ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ లో శివకార్తికేయన్ హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. దసరాకి పర్ఫెక్ట్  ట్రీట్ గా ఈ పోస్టర్ ఆకట్టుకుంది.

ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్‌లు భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగల్ ”బింబిలిక్కి పిలాపి” , డి జెస్సికా’ పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాత.

తారాగణం: శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు.

సాంకేతిక విభాగం
రచన, దర్శకత్వం: అనుదీప్ కె.వి
సంగీతం: ఎస్ థమన్
నిర్మాతలు: సునీల్ నారంగ్(నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో)డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్
సమర్పణ: సోనాలి నారంగ్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: మనోజ్ పరమహంస
సహ నిర్మాత:  అరుణ్ విశ్వ
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ : నారాయణ రెడ్డి
పీఆర్వో : వంశీ-శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close