MOVIE NEWS

మత్స్యకారుల జీవితాల నేపథ్యంతో “జెట్టి”, ఈ నెల 28న రిలీజ్

"Jetti", based on the lives of fishermen, will release on 28th of this month

నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “జెట్టి”.
తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.  వర్ధిన్
ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వం వహిస్తున్నారు. చివరి దశ సన్నాహాల్లో ఉన్న
ఈ సినిమా ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర డేట్ అనౌన్స్
మెంట్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా

హీరోయిన్ నందిత శ్వేతా మాట్లాడుతూ…విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పల్లెటూరి
అమ్మాయిగా నటించాలి అనేది నా కోరిక. అది ఈ సినిమాతో నెరవేరింది. ఈ సినిమా
గురించి చెబితే అర్థం కాదు. తెరపై చూసి అనుభూతి చెందాల్సిందే. చీరాల
ప్రాంతాన్ని మా చిత్రంలో సినిమాటోగ్రాఫర్ అద్భుతంగా తెరకెక్కించారు.
నిర్మాత వేణు గారు సినిమా ప్రారంభం నుంచీ చివరి దాకా ఒకటే ఆత్మవిశ్వాసంతో
ఉన్నారు. సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. జెట్టితో మంచి విజయం
సాధిస్తామనే నమ్మకం మా అందరిలో ఉంది. అని చెప్పింది.

దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక మాట్లాడుతూ…ఈ సినిమా రూపొందించే అవకాశం
ఇచ్చిన నిర్మాత వేణు మాధవ్ కె గారికి థాంక్స్. సినిమా మేకింగ్ లో ఎక్కడా
ఆయన కాంప్రమైజ్ కాలేదు. అలాగే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా ది
బెస్ట్ వర్క్ చేయిస్తున్నారు. ఖర్చు గురించి ఆలోచించకుండా సినిమాను
నిర్మించారు. మత్స్యకారుల జీవితాల్లోని సమస్యలను చెప్పే చిత్రమిది.
కొందరు తమ స్వార్థంతో  పోర్టుల పేరుతో వారి మత్య్సకారుల జీవితాలను ఎలా
ఇబ్బందులు పెడుతున్నారు అనేది ఇట్రెస్టింగ్ గా తెరకెక్కించాం. హీరో
హీరోయిన్లతో పాటు పలువురు మైమ్ గోపీ వంటి స్టేజీ ఆర్టిస్టులు తమ
పాత్రల్లో అద్భుతంగా నటించారు. అన్నారు.

నిర్మాత  వేణు మాధవ్ కె మాట్లాడుతూ…జెట్టి అంటే పోర్టు అని అర్థం. మన
సముద్ర తీరాన ఎంతోమంది మత్స్యకారులు జీవితాలను సాగిస్తున్నారు. వీళ్లు
నివసించే ప్రాంతాల్లో పోర్టులను ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ల
జీవనోపాధిని కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు దెబ్బతీస్తున్నారు.
కష్టపడితే గానీ రోజు గడవని పరిస్థితి వారిది. అలాంటి మత్స్యకారుల
జీవితాల్లోని సమస్యలను ప్రతిబింబించే చిత్రమిది. సగటు ప్రేక్షకులకు
కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. కార్తీక్ కొడకండ్ల సంగీతం ఆకర్షణ
అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో ఉంది సినిమా. ఈ నెల 28న
మూవీని విడుదల చేయబోతున్నాం. మత్య్సకారుల జీవన విధానాలను, వారి
కట్టుబాట్లను, ఇప్పటివరకూ వెండితెరమీద కనిపించని జీవితాలను తెరమీద
హృద్యంగా దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక తీసుకురాబోతున్నాడు. అన్నారు.

హీరో మన్యం కృష్ణ మాట్లాడుతూ…ప్రేక్షకులకు జెట్టీ సినిమా ఒక కొత్త
అనుభూతిని అందిస్తుంది. ఈ సిినిమా ఇంత బాగా వచ్చిందంటే కారణం నిర్మాత
వేణు, దర్శకుడు సుబ్రహ్మణ్యం గారు కారణం. ఈ చిత్రంలో ఒక మంచి పాత్రతో మీ
ముందుకొస్తున్నాను. మిమ్మల్ని సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ నెల
28న థియేటర్లలో చూడండి. అన్నారు.

సంగీత దర్శకుడు కార్తీక్ కొడకండ్ల మాట్లాడుతూ…ఈ చిత్రంలో మంచి మ్యూజిక్
ఇచ్చే అవకాశం దొరికింది. ఈ పాటకు ఫలానా సింగర్ కావాలి అనుకుంటే
కాంప్రమైజ్ కాకుండా నిర్మాత ఇచ్చారు. అలా సిధ్ శ్రీరామ్, సునీత వంటి
సింగర్స్ తో పాటలు పాడించాం. హృద్యమైన కథా కథనాలతో పాటు మ్యూజికల్ గా
సినిమా ఆకట్టుకునేలా ఉంటుంది. అన్నారు.

సాంకేతిక బృందం
బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్
మ్యూజిక్ :  కార్తిక్ కొడకండ్ల‌
డిఓపి:  వీర‌మ‌ణి
ఆర్ట్ ః ఉపేంద్ర రెడ్డి
ఎడిటర్:  శ్రీనివాస్ తోట‌
స్టంట్స్: దేవరాజ్ నునె
కోరియోగ్రాఫర్ : అనీష్
పబ్లిసిటీ డిజైనర్:  సుధీర్
డైలాగ్స్ ః శ‌శిధ‌ర్
పిఆర్ ఓ : జియస్ కె మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః పండ్రాజు శంక‌ర్రావు
నిర్మాత ః వేణు మాధ‌వ్
క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ ః సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక

నటీ నటులు: నందిత శ్వేత‌, కృష్ణ , క‌న్న‌డ కిషోర్, మైమ్ గోపి,  ఎమ్ య‌స్
చౌద‌రి, శివాజీరాజా, జీవా, సుమ‌న్ షెట్టి తదితరులు

Tags

Related Articles

Back to top button
Close
Close