MOVIE NEWSNEWSSpecial BitesTelangana

అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 ట్రైలర్ తో వచ్చేస్తున్న నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు ప్రశాంత్ వర్మ

Blockbuster duo Nandamuri Balakrishna and Prashant Verma are back for ‘Unstoppable with NBK 2’

– ఈ ట్రైలర్ ను అక్టోబర్ 4 న విజయవాడ లో విడుదల చేయనున్న ఆహ –

హైదరాబాద్, 1 అక్టోబర్ – అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ఆహా ద్వారా ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు నటసింహం నందమూరి బాలకృష్ణ. సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. 100 % లోకల్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతోన్న ఆహా తెలుగు ఈసారి కూడా ఎవరూ చూడని విధంగా బాలయ్య బాబు ని అభిమానులకి చూపించబోతుంది. ఐఏండిబి లో టాక్ షో అన్నింటిలోనూ అన్ స్టాపబులే నెంబర్ వన్ ఉండేలా నిలబెట్టారు బాలకృష్ణ.  మొదటి సీజన్ ను ఘనవిజయంగా పూర్తి చేసిన ఆహా. ఇప్పుడు సీజన్ 2 తో రావడానికి రెడీ అవుతోంది. అందు కోసం మరోసారి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో జతకటింది మన ఆహ.

జాంబీ రెడ్డి, మరియు కల్కి లాంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ 2011 లో దీనమ్మ జీవితం అనే షార్ట్ ఫిలిం తో ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. అలా మొదలుబెట్టిన తన ప్రయాణం దర్శకత్వం అన్ స్టాపబుల్ సీసన్ 1 వరకు సాగింది. నందమూరి బాలకృష్ణను ఇలా కూడా చూడగలమా అనేంత గొప్పగా చూపించారు. ఇప్పుడు మరోసారి ఎవరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణ ను చూపించబోతున్నారు ప్రశాంత్ వర్మ. ఆహా వారు ట్రైలర్ ని అక్టోబర్ 4 విజయవాడ లో అభిమానుల ముందు ప్రదర్శించబోతున్నారు.

దర్శకులు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, “సీజన్ 1 ప్రోమో షూట్ తర్వాత బాలకృష్ణ గారితో మరోసారి తప్పకుండా పనిచేయాలని చాలా గట్టిగా అనుకున్నాను, అందుకే ఈసారి కూడా అవకాశం నాకే వచ్చింది. ఆహ టీం సీజన్ 2 ట్రైలర్ కోసం స్టోరీ రాయాలి అనగానే, నేను వెంటనే ఒప్పుకున్నాను. బాలయ్య గారితోటి పని చేయడమంటేనే ఒక అద్భుతం. ఈ స్టోరీ అందరికి నచ్చే విధంగా తీర్చిదిద్దుతాను. ఒక విధంగా ఇది నా ముద్దుబిడ్డ అని చెప్పొచ్చు. అక్టోబర్ 4 న మీరు చూసే ట్రైలర్ అందరికి నచ్చుతుందుని ఆశిస్తున్నాను.”

దర్శకుడి పైసా వసూల్ కథ మరియు బాలయ్య బాబు ఆక్షన్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే అక్టోబర్ 4 న జరిగే ట్రైలర్ రిలీజ్ అందరూ చూడాల్సిందే. విజయవాడలో జరిగే ఈ వేడుకకు అందరూ ఆహ్వానితులే.

&&&&&&&

Blockbuster duo Nandamuri Balakrishna and Prashant Verma are back for ‘Unstoppable with NBK 2’

aha Telugu is all set to launch the trailer on 4th October at Vijayawada – 

Hyderabad, 1st October: aha’s brainchild ‘Unstoppable with NBK’ has captivated the audience since its inception. The show features Nandamuri Balakrishna, the host who has won the hearts of the millions with the first season. The IMDb top-rated talk show is gearing up for a massive surprise for its ardent viewers. Well, yes!! Known to leave no stone unturned in entertaining its masses, aha Telugu has constantly been associating with Tollywood legends, successfully making its mark in the digital streaming industry. The 100% local entertainment OTT platform is all set to associate with veteran director Prashant Verma and this time will surely be breath-taking. 

Prashant Verma, the director of spectacular films such as Zombie Reddy, Kalki, and Awe, has always been someone who pushed the envelope with everything he has done so far. From directing a short film Deenamma Jeevitham in 2011 to being a captain of the ship for the promo of Unstoppable with NBK season 1 for the King of the Masses, Nandamuri Balakrishna, aka NBK, has done it all. The noble icon’s vision for the concept video of the Unstoppable with NBK season 2 is going to be absolutely magical!

Talking about the same, Prashant Verma shared, “I’ve been waiting to collaborate with Balakrishna sir, after directing the promo of season 1, which created a history in the world of talk shows. To explicate a story again for NBK is surreal. The minute aha approached me for Unstoppable with NBK season 2, I was drawn to it. The film delivers everything one expects. It wouldn’t be wrong to say this promo is, in a way, my brainchild, so I ensured that everything must be picture-perfect! It’s been a blast working with the Balayya and aha team. I hope the audience enjoys the effort on 4th October.”

Watch Prashant Verma’s paisa vasool vision and Nandamuri Balakrishna crashlanding into your screens with his usual panache and super energy on 4th October 2022 at Vijayawada!

Tags

Related Articles

Back to top button
Close
Close