MOVIE NEWS

‘విక్కీ ది రాక్ స్టార్’ నుంచి ‘పోదాం వెళ్లిపోదాం’ పాట విడుదల

Mesmerizing Melody Podham Vellipodhaam From 'Vikky The Rockstar' Released

విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలలో సిఎస్ గంటా దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో ‘విక్కి ది రాక్ స్టార్’ అనే పేరుతో ఓ డిఫరెంట్ మూవీ రూపొందుతోంది. హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

తాజాగా ఈ చిత్రం నుంచి వినాయక చవితి సందర్భంగా ఓ అప్డేట్ వచ్చింది. విక్కీ ది రాక్ స్టార్ నుంచి ఇదివరకు విడుదల చేసిన ఫస్ట్ షేడ్‌‌, లవ్ షేడ్‌లకు మంచి స్పందన వచ్చింది. పిల్లా నువ్వు నాకు ప్రాణమే అనే పాట కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు పండుగ సందర్భంగా ఓ ఆహ్లాదకరమైన పాటను విడుదల చేశారు మేకర్స్.

‘పోదాం వెళ్లిపోదాం’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటలో హీరో హీరోయిన్లు, వారి స్నేహితులు కలిసి వేస్తున్న ట్రిప్స్, వాటి లొకేషన్లను అందంగా చూపించారు. ముఖ్యంగా ఈ పాటలోని లొకేషన్లు మాత్రం అందరినీ కట్టిపడేసేలా ఉన్నాయి. సునీల్ కశ్యప్ అందించిన బాణీ.. విశ్వనాథ్ కాసర్ల సాహిత్యం, విష్ణుప్రియ గాత్రం అద్భుతంగా కుదిరాయి.

గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రాండ్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలనేది మేకర్స్ ప్లాన్. 

ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎవ్వరూ చేయని జానర్‌ని టచ్ చేస్తూ ఈ సినిమా రూపొందించారని ఇప్పటికే వదిలిన అప్డేట్స్ తెలుపుతున్నాయి. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ టచ్ చేస్తూ నేటితరం ఆడియన్స్ కోరుకునే స్టఫ్‌తో ఈ మూవీని సిద్ధం చేస్తున్నారని స్పష్టమవుతోంది. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. 

సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా  బాధ్యతలు చేపట్టారు. భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌‌గా వ్యవహరిస్తుండగా.. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సునీల్ కశ్యప్ బాణీలు అందించారు.  

సాంకేతిక వర్గం

రచన & దర్శకత్వం : సిఎస్ గంటా

బ్యానర్: స్టూడియో87 ప్రొడక్షన్స్

నిర్మాత: ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF)

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్  : సుభాష్, చరిత

సంగీతం: సునీల్ కశ్యప్

సినిమాటోగ్రాఫర్‌: భాస్కర్ 

ఎడిటర్: ప్రదీప్ జంబిగా 

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్యామల చంద్ర

డిజైనర్: TSS కుమార్

పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

Mesmerizing Melody Podham Vellipodhaam From ‘Vikky The Rockstar’ Released

After a long time, a musical based film is coming in Tollywood. We are talking about the film ‘Vikky The Rockstar’ which is a youthful entertainer with a unique story. The film directed by CS Ganta and produced by Flight Lieutenant Srinivas Nuthalapati(IAF) under the banner of Studio87 Productions features Vikram and Amrutha Chowdary in the lead roles. While Mrs. Vardhini Nuthalapati presents the movie, Subhash and Charitha are the executive producers.

Sunil Kashyap has rendered soundtracks of the movie and previously released songs got tremendous response. Today, on the occasion of Vinayaka Chavithi, they have come up with a mesmerizing melody Podham Vellipodhaam. Friends go on a trip and the song shows the friendship of the group. Sunil Kashyap has scored yet another chartbuster number, we must say. The composition is so good, so are the vocals of Vishnu Priya. Viswanath Karasala has penned the lyrics. Team D.O.T took care of choreography of the number. 

Cinematography for the movie is by Baskar, while Pradeep Jambiga is the editor. The makers are planning to release the movie soon.

Technical Crew:

Director: CS Ganta

Banner: Studio87 Productions

Producer: Flight Lieutenant Srinivas Nuthalapati(IAF) 

Executive Producers: Subhash, Charitha

Music: Sunil Kashyap

Cinematographer: Baskar

Editor: Pradeep Jambiga

Production Executive: Shyamala Chandra

Designer: TSS Kumar

PRO: Sai Satish, Parvataneni Rambabu

Tags

Related Articles

Back to top button
Close
Close