MOVIE NEWS

సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ చిత్రం నుంచి ‘అట్టాంటిట్టాంటి’ మాస్ నెంబర్ కు అనూహ్య స్పందన..

Unexpected response to the mass number 'Attantittanti' from Kiran Abbavaram's film 'Nēnu mīku bāgā kāvālsina‌vāḍini' which will be released worldwide on September 9..

యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో చేస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని. S R కళ్యాణ మండపం లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజావారి రాణిగారు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం, సమ్మతమే లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం.. ఇందులో చాలా కొత్తగా కమర్షియల్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో మాస్ నెంబర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

నేను అట్టాంటిట్టాంటి దాన్ని కాదు మావో..
నీకు చెమటలు పట్టించుకోని పోను మామో..
నేను అట్టాంటిట్టాంటి దాన్ని కాదు మావో..
నీ కండలు కరిగించి కానీ పోను మామో..

అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పాటలో బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాలోని ‘చిలకపచ్చ కోక’, అలాగే అన్నయ్య సినిమాలోని ‘ఆట కావాలా పాట కావాలా’ పాటలకు కూడా డాన్స్ చేసి మెప్పించారు కిరణ్ అబ్బవరం. ఇది ఈ మాస్ నెంబర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్నాడు. సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

న‌టీన‌టులు –

కిర‌ణ్ అబ్బ‌వ‌రం, సంజ‌న ఆనంద్‌, సోనూ ఠాకూర్, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌, స‌మీర్‌, సంగీత‌, నిహ‌రిక‌, ప్ర‌మోదిని, భరత్ రొంగలి త‌దిత‌రులు

టెక్నికల్ టీమ్:

స‌మ‌ర్ప‌ణ‌.. కోడి రామ‌కృష్ణ‌
బ్యాన‌ర్‌.. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
లిరిక్స్‌.. భాస్క‌ర్ భ‌ట్ల
ఎడిట‌ర్‌.. ప్ర‌వీన్ పూడి
ఆర్ట్ డైర‌క్ట‌ర్‌.. ఉపేంద్ర రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ..  భ‌ర‌త్ రొంగలి
పిఆర్ ఓ.. ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్‌
డిజిటల్ ప్రమోషన్స్.. వినీత్ సందీప్
సినిమాటోగ్ర‌ఫి.. రాజ్ కే నల్లి
సంగీతం.. మ‌ణిశ‌ర్మ‌
కో-ప్రోడ్యూస‌ర్‌.. న‌రేష్ రెడ్ది మూలే
ప్రోడ్యూస‌ర్‌.. కోడి దివ్య దీప్తి
డైర‌క్ట‌ర్‌.. శ్రీధర్ గాదె (SR కళ్యాణమండపం ఫేమ్)

Thanks & Regards,
Eluru Sreenu
P.R.O

Murthy

Tags

Related Articles

Back to top button
Close
Close