NEWS
Trending

జయలలిత మరణం వెనుక చాలా అనుమానాలున్నాయని అప్పుడు చెప్పిన నేతలు

ఇప్పుడు అధికారం లోఉండి కూడ దానిపై ఎందుకు మౌనంగా వున్నారో
ఎన్నికలకు పోయే ముందు ప్రజలకు AIADMK నేతలు సమాధానం చెప్పాలని
తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతి రెడ్డి జగదేశ్వరెడ్డి
డిమాండ్ చేసారు.. నేడు చెన్నై నగరంలోని తిరువళ్ళి కేళి నందుగల
స్వాతంత్రనగర్ నందు AIADMK అదినేత్రి స్వర్గీయ జయలలిత 72 వ
జన్మదినాన్ని పురష్కరిచుకొని తమిళనాడు తెలుగు యువశక్తి జరపుతున్న 5
రోజుల పుట్టినరోజు వేడుకలలో భాగంగా నేడు పేద మహిళలకు చీరలు పంపిణి
చేశారు, ఈ కార్యక్రమాలను తమిళనాడు తెలుగు యువశక్తి నేటి నుండి 27వ
తారీకు వరకు వివిధ సాంఘిక సేవా కార్యక్రమాలు ఆలయాలలో,
చర్చిలలో,మసీదులలో పూజలు చేయనున్నారు
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి
సమావేశం లో మాట్లాడుతూ “జయలలిత జన్మదిన వెడుకులు ఇలా పేదల మధ్య
జరపటకు వారే స్పూర్తి దాయకమని, దేశంలో ఎన్నో రాష్ట్రాలు
ప్రస్తుతం తమిళనాడు రాష్టంలోని జయలలిత ప్రవేశపెట్టిన సంక్షేమ
పధకాలను ఆచరిస్తున్నారని చెప్పుటకు ఇటివల డిల్లీ ఎన్నికల్లో
తమిళనాడు రాష్టం యొక్క సంక్షేమ కార్యక్రమాలను ఆచరిస్తామని
చెప్పి ఎన్నికల్లో విజయం అప్ పార్టీ విజయం సాధించిoదని, జయలలిత ఒక
ముఖ్యమంత్రిగా దేశంలోని రాష్ట్రాలన్నీoటికి ఇప్పుడు ఎన్నో
సంక్షేమ పధకాలను చెప్పట్టుటకు దేశంలోనే ఒక ఆదర్శమయినారని, వారి
అకాల మరణం తమిళనాడు ప్రజలను కృంగా తీసిందని రాష్ట్రంలోని రాజకీయ
నాయకులో, ప్రజలలో జయలలిత మరణం వెనుక ఒక రహస్యం దాగి ఉందని ఒక
అనుమానం ఉందని ఇప్పుడు ప్రభుత్వంలో వున్నవారు ఇదే విషయం పై ఎన్నో
సార్లు గొంతెత్తి ధర్నాలు చేసి తమ గళాన్ని అప్పుడు ఇప్పరని, కాని
ఇప్పుడు అది ఒక ముగిసిపొయిన చరిత్రగా మిగిలిందని, ఆ చరిత్ర ఒక ముగిసిన
చరిత్ర కాకూడదని రాష్ట్రం లోని ప్రజలు కోరు కుంటున్నారని, నేను నా
వంతు భాద్యత గా తమిళనాడు ప్రజల పక్షాన్న జయలలిత మరణించిన రోజే
సుప్రీంకోర్టు ని ఆశ్రయిoచి 75 రోజులలో హాస్పిటల్లో జరిగిన
కుంభకోణాన్ని వెలికి తీయులని CBI దర్యాప్తుకు డిమాండ్ చేస్తూ
కోర్టు లో

పిటిషన్ వేయడం జరిగిందని, అంతే కాకుండా ఈ వ్యవహారాన్ని
ప్రదాన మంత్రి దృష్టికి, హోం మంత్రి దృష్టికి పార్లమెంట్ దృష్టికి
తీసుకు రావడమే కాకుండా ఎన్నో ఉద్యమాలను డిల్లీ జంతర్ మంతర్ నందు
ధర్నా, అదే విధం గా పోస్ట్ కార్డుల ఉద్యమం. వివిధ ఆలయాలలోని
దేవుళ్ళకు వినతి పత్రాలు సమర్పించి నా వంతు భాద్యత గా జయలలిత గారి
పై నాకున్న అభిమానానికి గుర్తుగా ఈ కార్యక్రమాలు అన్ని చేపట్టటం
జరిగిందని, అమ్మ విధేయుడిగా నా ప్రయత్నాన్ని ఎన్నో సార్లు
కేంద్రానికి వెలిగెత్తి చాటడం జరిగిందని, ఆ తర్వాత రోజులలో అప్పుడు
రాష్ట ప్రభుత్వం ఆర్ముగస్వామి కమిషన్ వేసి జయలలిత మరణం పై
జుడిషియల్ దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వగా ఆ కేసులో విచారణను
ఎదురుకొనుచున్నా హాస్పిటల్ వర్గాలు సుప్రీంకోర్టుని ఆశ్రియిoచి
అర్ముగస్వామి కమిషన్ విచారణ పై స్టే తీసుకోవడం జరిగిందని, ఆ అమ్మ
మరణం వెనకాల వున్న మర్మాన్ని వెలికి తీసే ప్రయత్నం లో ప్రభుత్వం
విఫలమైంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో లోకల్ బాడి
ఎన్నికల్లో AIADMK ఘోర పరాజయం పాలైందని, ఇప్పుడు వున్న
ప్రభుత్వధినేతలు నిజంగా అమ్మ విదేయులైతే ఆ మరణానికి సంబంధించిన
వాస్తవాలను ప్రజలముందు వుంచాలని అలా వుంచని పక్షం లో రేపు త్వరలో
2021 లో శాసనసభకు జరిగే ఎన్నికల్లో ఇప్పుడు వున్న
ప్రభుత్వధినేతలందరికీ ఘోర పరాజయం తప్పదని, కాబట్టి ముఖ్యమంత్రి
కేంద్రాన్ని అమ్మ మరణం పై CBI దర్యాప్తు కావాలని కోరాలని అలా
కోరినప్పుడే ప్రజలు ఈ ప్రభుత్వాధినేతలను అక్కున చేర్చుకుంటారని,
తమిళనాడులో మైనారిటిలకు భాషకు సంభందించి జయలలిత సహకరించక
పోయినప్పటికీ, వారికి తెలుగు ప్రజల మీద వున్న ప్రేమకు గుర్తుగా
తమిళనాడు తెలుగు యువశక్తి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి
సాంఘిక సేవా కార్యక్రమాలను చేపట్టటం జరుగుతుందని కేతిరెడ్డి
జగదీశ్వర రెడ్డి తన ఉపన్యాసం లో తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలుగురు మహిళలతో పాటు స్వాతంత్రనగర్ కు
చెందిన తెలుగు యువశక్తి కార్యవర్గం D శివశంకర్ రెడ్డి, V.
కృష్ణరెడ్డి, S.వెంకటేశ్వర రావు, కళ్యాణ్ , నాగేశ్వర రావు, B
గోవర్ధన్, కె. కళ్యాణ్ కృష్ణ , తరుణ్ సాయి తదితరులు పాల్గొన్నారు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close