
MOVIE NEWSNEWS
సీఎం కేసీఆర్కు అంతా శుభమే జరగాలి: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు
All the best for CM KCR: Director Raghavendra Rao

యాదాద్రి: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించారు. శుక్రవారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న రాఘవేంద్ర రావు.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు అన్ని శుభాలే జరగాలని ఆకాంక్షించారు. యాదాద్రి దేవస్థానాన్ని ముఖ్యమంత్రి మహాద్భుతంగా పునర్నిర్మించారని చెప్పారు.
తాను కొత్తగా సినిమా రూపొందించే ముందు, అదేవింధంగా సినిమా విడుదల సమయంలో స్వామివారిని దర్శించుకుంటానని తెలిపారు. పూర్తి వినోదభరితమైన ‘వాంటెడ్ పండుగాడు’ అనే సినిమా నేడు విడుదలయిందన్నారు.