MOVIE NEWSNEWS

అన్ని ప్రాంతాలు వారు అన్నయ్య బర్త్ డే వేడుకల్లో పాల్గొనాలి – మెగా బ్రదర్ నాగబాబు

All regions should participate in brother birthday celebrations - Mega Brother Nagababu

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన, అనతి కాలంలో ఎన్నో కష్టానష్టాలను అనుభవించిన తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఎన్టీఆర్.. ఏఎన్నార్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఆగస్ట్ 22 వచ్చిందంటే కేవలం చిరంజీవి కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు.. మెగాభిమానులకు పండగ రోజే. అభిమానులు ప్రతి ఏటా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ను అట్టహాసంగా జరుపుతారు. ఆ మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పుట్టిన రోజు వేడుకలను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా మెగా బ్రదర్ నాగబాబు ప్రెస్ మీట్ ను నిర్వహించి మీడియాతో కొన్ని విషయాలను పంచుకున్నారు.

ప్రతి సంవత్సరం అన్నయ్య బర్త్ డే శిల్పకళ వేదికలో చేసేవాళ్ళం ఈ సంవత్సరం కొంచెం కొత్త గా ప్లాన్ చేస్తున్నాం అని తెలుపుతూ, బర్త్ డే వేడుకలు లో అభిమానులు కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఎంజాయ్ చేసే విధంగా డిజైన్ చేసినట్లు చెప్పుకొచ్చారు.

అలానే అభిమానుల కోసం కార్నివాల్ ఫెస్టివల్ నీ హైటెక్స్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఇండియా లో ఏ సినిమా హిరో కి కార్నివాల్ లాంటిది పెట్టలేదు, ఈ కార్నివాల్ ఫెస్టివల్ అనేది ఫ్యాన్స్ కి ఒక మెమ్రబుల్ డే గా వుండాలని తెలిపారు. చాలా ఊర్లలో లో చిరంజీవి బర్త్ డే నీ పండుగ లాగా చేసుకుంటారు కార్నివాల్ లో అన్ని ప్రాంతాల అభిమానులు పాల్గొనాలి,అన్ని సదుపాయాలు ఆ కార్నివాల్ లో వుంటాయి అని అభిమానులకు పిలుపునిచ్చారు.

కార్నివాల్ లో చిరంజీవి గారి గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు పంచుకుంటానని తెలిపారు. ఈ కార్నివాల్ ఫెస్టివల్ కి మా ఫ్యామిలీ నుంచి అందరూ హిరో లు పాల్గొంటారు. ఇతర హీరోలు, ఆయనను అభిమానించే వారు అందరూ ఈ ఫెస్టివల్ లో పాల్గొంటారని మెగా బ్రదర్ తెలిపారు.

Tags

Related Articles

Back to top button
Close
Close