MOVIE NEWS

డైలాగ్స్‌తో ఆకట్టుకుంటున్న ‘విక్కీ ది రాక్ స్టార్’ రివల్యూషన్ షేడ్

'Vikky The Rockstar' – Revolution Shade Unleashed

విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలలో సిఎస్ గంటా దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో ‘విక్కి ది రాక్ స్టార్’ అనే పేరుతో ఓ డిఫరెంట్ మూవీ రూపొందుతోంది. హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా  బాధ్యతలు చేపట్టారు. భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌‌గా వ్యవహరిస్తుండగా.. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సునీల్ కశ్యప్ బాణీలు అందించారు.  

విక్కీ ది రాక్ స్టార్ నుంచి ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ షేడ్‌, లవ్ షేడ్‌లకు మంచి స్పందన వచ్చింది.‘పిల్లా నువ్వు నాకు ప్రాణమే’ అనే పాటతో సినిమా మీద మరింత బజ్‌ను క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో ఎమోషనల్ కంటెంట్‌ను రిలీజ్ చేశారు. రివల్యూషన్ షేడ్ అంటూ తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్లు ఓ వీడియోను విడుదల చేశారు. 

‘చచ్చిపోవడం అంటే ప్రాణాలతో లేకపోవడం కాదురా.. ధైర్యం లేకుండా బతకడం కూడా చచ్చినట్టే అని తల్లి చెప్పడం.. ‘ధైర్యం కావాలంటే ఏం చేయాలి అమ్మా?’ అని పిల్లాడు అడగటం.. ‘ధైర్యం కావాలంటే ప్రాణాల మీద ఆశ వదిలి.. పక్కోళ్ల ప్రాణాల కోసం పోరాడు.. ధైర్యం అదే వస్తుంది’ అంటూ ఆ తల్లి చెప్పిన మాటలతో ఈ సినిమాలో కథ, కథనాలు ఎలా ఉండబోతోన్నాయో అర్థమైంది. ఇక ఈ రివల్యూషన్ షేడ్‌తో సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రాండ్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలనేది మేకర్స్ ప్లాన్. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రాక్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ వీడియో, ఫస్ట్ షేడ్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 

ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎవ్వరూ చేయని జానర్‌ని టచ్ చేస్తూ ఈ సినిమా రూపొందించారని ఇప్పటికే వదిలిన అప్డేట్స్ తెలుపుతున్నాయి. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ టచ్ చేస్తూ నేటితరం ఆడియన్స్ కోరుకునే స్టఫ్‌తో ఈ మూవీని సిద్ధం చేస్తున్నారని స్పష్టమవుతోంది. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. 

సాంకేతిక వర్గం

రచన & దర్శకత్వం : సిఎస్ గంటా

బ్యానర్: స్టూడియో87 ప్రొడక్షన్స్

నిర్మాత: ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF)

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్  : సుభాష్, చరిత

సంగీతం: సునీల్ కశ్యప్

సినిమాటోగ్రాఫర్‌: భాస్కర్ 

ఎడిటర్: ప్రదీప్ జంబిగా 

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్యామల చంద్ర

డిజైనర్: TSS కుమార్

పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

‘Vikky The Rockstar’ – Revolution Shade Unleashed

Vikky The Rockstar

‘Vikky The Rockstar’ is a unique musical romantic entertainer. Vikram and Amrutha Chowdary are the lead pair in the movie being directed by CS Ganta. Flight Lieutenant Srinivas Nuthalapati(IAF) is producing the film on grand scale under the banner of Studio87 Productions, while Mrs. Vardhini Nuthalapati presents it. Subhash and Charitha are the executive producers.

The team is promoting the movie uniquely. Different shades of the movie and the protagonist are shown through series of videos. The first shade was a heart-wrenching video with deep emotions. Today, they have unleashed Revolution Shade.

The glimpse begins with Bob Marley’s famous quote- “Live for yourself and you will live in vain. Live for others, and you will live again.”

The protagonist’s mother motivates him saying one should fight for others life, and that will help him build his courage. That’s all about the Revolution Shade Of Vikky The Rockstar. Sunil Kashyap deserves special mention for his tear-jerking BGM.

‘Vikky The Rockstar’ is in last leg of post-production works and the previously released promotional content got tremendous response. The film’s release date will be disclosed soon.

Cinematography for the movie is by Bhaskar, while Pradeep Jambiga is the editor.

Technical Crew:

Director: CS Ganta

Banner: Studio87 Productions

Producer: Flight Lieutenant Srinivas Nuthalapati(IAF) 

Executive Producers: Subhash, Charitha

Music: Sunil Kashyap

Cinematographer: Bhaskar

Editor: Pradeep Jambiga

Production Executive: Shyamala Chandra

Designer: TSS Kumar

PRO: Sai Satish, Parvataneni Rambabu

Murthy

Tags

Related Articles

Back to top button
Close
Close