
లెజండరీ దర్శకుడు శంకర్ ముఖ్య అతిధిగా శివకార్తికేయన్, మడోన్ అశ్విన్, శాంతి టాకీస్ ‘మహావీరుడు’ షూటింగ్ గ్రాండ్ గా ప్రారంభం
Sivakarthikeyan, Madone Ashwin, Shanti Talkies' 'Mahaveerudu' shooting kicks off in grand fashion with legendary director Shankar as chief guest

హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా నిర్మాణంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మహావీరుడు’. అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పూజా కార్యక్రమానికి లెజండరీ డైరెక్టర్ శంకర్ ముఖ్య అతిధిగా హాజరై చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అందించారు.
కాగా ఇటివలే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆవిష్కరించి ఈ సినిమా టైటిల్ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది.


భరత్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విధు అయ్యన్న డీవోపీ ,ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు .
తారాగణం: శివకార్తికేయన్, అదితి శంకర్ , యోగి బాబు ,సరిత ,మిస్కిన్
సాంకేతిక విభాగం ;
రచన, దర్శకత్వం – మడోన్ అశ్విన్
నిర్మాత – అరుణ్ విశ్వ
బ్యానర్ – శాంతి టాకీస్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ – విధు అయ్యన్న
సంగీతం – భరత్ శంకర్
ఎడిటర్ – ఫిలోమిన్ రాజ్
Pro: Vamsi – Shekar