

Bimbisara first half.
This is going to be Kalyan ram’s career biggest movie..Time travel content..
New World..
What a story..
Kalyan ram as Bimbisara is super 5- overall
Rating1/2 ( 3.5/5)
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్. కళ్యాణ్ రామ్ ఆయన కేరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ఇది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది.
దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘బింబిసార’ కథేంటి? త్రిగర్తల సామ్రజ్యాధినేత బింబిసారుడిగా కల్యాణ్ రామ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నార.అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.
తెలుగు ప్రేక్షకులను తిరిగి థియేటర్స్‌కి రప్పించే చిత్రమిదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఫస్టాఫ్ కొంచెం స్లోగా ఉందని, సెకండాఫ్ అదిరిపోయిందని చెబుతున్నారు. బింబిసారగా కల్యాణ్ రామ్ యాక్టింగ్ చాలా బాగుందని చెబుతున్నారు. వన్ మ్యాన్ షోగా సినిమాను తన భుజానా వేసుకొని నడిపించాడట. ఎంఎం కీరవాణి మ్యూజిక్, విజువల్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయని చెబుతున్నారు.
మరోవైపు బింబిసార టీమ్‌కు సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ తమన్, సాయి తేజ్, సత్యదేవ్ తదితరులు ట్వీట్స్ చేశారు.