MOVIE NEWS

Bigg Boss fame Sohel’s ‘Lucky Lakshman’ Title Song Released – News l Stills l Song Video for TV Channels

Bigg Boss fame Sohel's 'Lucky Lakshman' Title Song Released - News l Stills l Song Video for TV Channels

బిగ్ బాస్ ఫెమ్ సోహైల్  హీరోగా దత్తాత్రేయ మీడియా పతాకంపై రూపొందిస్తోన్న “లక్కీ.లక్ష్మణ్‘’ సినిమా నుంచి “అదృష్టం హలో అంది రో.. చందమామ” టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసిన మజిలీ,ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ

చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో ఔట్ & ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్‌’. దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ సినిమాలోని ‘అదృష్టం హలో అంది రో.. చందమామ’ టైటిల్  లిరికల్ విడియో సాంగ్ ను మజిలీ,ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ విడుదల చేశారు.

అదృష్టం హలో అంది రో చందమామ,
హగ్గిచ్చి చలో అందిరో చందమామ,
ఒరయ్యో ఓవర్ నైట్ లో చందమామ,
రిచ్ కిడ్ అయిపోయాడురో చందమామ,
ఫెటు  మారిందే.. రూటు మారిందే.. టాప్ టూ బాటం స్టైలు మారిందే..
ఫెసు లొకి కొత్త కళ తన్నుకొని వచ్చిందే ఖుదాగవా వీడి హవా గట్టిగానే వీచిందే..
లక్ష్మి దేవి, లక్ష్మి దేవి, నెత్తికెక్కి కూసుందే..
పండగ పండగ పండగ పండగ జిందగి మొత్తం రంగుల పండగ లే….
లక్కీ లక్కీ లక్కీ.. లక్కీ లక్కీ
లక్కీ లక్కీ లక్కీ.. లక్కీ లక్ష్మణ్
లక్కీ లక్కీ లక్కీ.. He is లక్కీ
లక్కీ లక్కీ లక్కీ.. లక్కీ లక్ష్మణ్

బ్రెయినేమో షార్ప్, వేస్తాడు మ్యాపు, వీడేరా తురుమూ తోపు
ఇవ్వడురో గ్యాపు, తియ్యడురో మ్యాపు, ఆడిస్తాడు ర్యాంపు ర్యాంపు
ఈ తెలివితేటలు కారెన్సీ  నోటలు లెక్కించలేమోయి  దే..వూ.. డా..
కలిసోచ్చే కాలము, నడిసోచ్చి నేరుగా, ఇతని మీద మనసు పడిన దేదేదేదేదే……
లక్కీ లక్కీ లక్కీ.. లక్కీ లక్కీ
లక్కీ లక్కీ లక్కీ.. లక్కీ లక్ష్మణ్
లక్కీ లక్కీ లక్కీ.. He is లక్కీ
లక్కీ లక్కీ లక్కీ.. లక్కీ లక్ష్మణ్

అంటూ సాగే ఈ పాటను చూస్తుంటేనే  డ్యాన్స్ వేద్దాం అనిపించేలా ఉంది.కథానాయకుడు రాత్రికి రాత్రే ధనవంతుడు అవుతాడనే కాన్సెప్ట్ చుట్టూ ఈ పాట తిరుగుతుంది. హీరో సోహైల్  అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు “అదృష్టం హలో అంది రో చందమామ” అంటూ సాగే లిరిక్స్ రిచ్ కిడ్ ‘హవా’లో సాగుతున్న ఈ పాటకు సోహైల్  డాన్స్  ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా అని చెప్పవచ్చు. ప్రముఖ రచయిత భాస్కరపట్ల రాసిన ఈ గీతాన్ని  సింగర్.. రామ్ మిరియాల చ‌క్క‌గా  ఆలపించారు. ఈ పాటకు విశాల్ అందించిన కొరియోగ్రఫీ  అద్భుతంగా ఉంది. డి ఓ పి  ఆండ్రు చక్కటి విజువల్స్ ఇచ్చాడు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ పాటలకు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రంలోని పాటలు కూడా ఆడియెన్స్‌ను మెస్మ‌రైజ్ చేస్తాయి.

ఈ సందర్బంగా ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ..”లక్కీ లక్ష్మణ్” లోని ఈ టైటిల్ సాంగ్ చాలా బాగుంది. ఈ చిత్ర దర్శకుడు ఏ ఆర్.అభి , నిర్మాత హరిత గిగినేని లకు ఇది మొదటి చిత్రమైనా చాలా చక్కగా తెరకెక్కించారు. వీరిద్దరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి. నటుడు సోహైల్  నటన బాగుంటుంది. ఇందులో తన డ్యాన్స్ చూడముచ్చటగా ఉంది. వీరి ముగ్గురు కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర హీరో సొహైల్ మాట్లాడుతూ… దర్శకులు శివ నిర్వాణ గారు ఎంతో బిజీగా ఉన్నా మా ”లక్కీ లక్ష్మణ్” టైటిల్ సాంగ్ విడియోను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తాజాగా ఈ సినిమా సాంగ్ టీజర్‌ను విడుదల చేశారు. మా దర్శకులు ఏ ఆర్. అభి , నిర్మాత హరిత గిగినేని లకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్  చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారు  ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ అవుట్‌పుట్ పరంగా క్వాలిటీ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సీనియర్ టెక్నీషియన్స్ తో నిర్మించిన .ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

చిత్ర  దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ…మంచి డీఫ్రెంట్ సబ్జెక్టు తో వస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి,టైటిల్ సాంగ్ ను శివ నిర్వాణ గార్ల చేతులమీదుగా విడుదల చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.సాంగ్ టీజర్ కు, ఫస్ట్ లుక్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు విడుదల చేసిన టైటిల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాము.సోహైల్ తో పాటు సీనియర్ నటులు మరియు సీనియర్ టెక్నిషన్స్ అందరూ మాకు ఫుల్  సపోర్ట్ చేయడంతో షూటింగ్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఔట్ & ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్  గా రూపొందిన “లక్కీ లక్ష్మణ్”. సినిమా కచ్చితంగా సోహైల్ కు టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేశాం.త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.

నటీనటులు

సోహెల్, మోక్ష, దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, ఝాన్సీ, రచ్చ రవి , జబర్దస్త్ కార్తిక్ , జబర్దస్త్ గీతు రాయల్ కామెడీ స్టార్స్ ఫేమ్ యాదం రాజు తదితరులు

సాంకేతిక నిపుణులు

బ్యానర్స్ – దత్తాత్రేయ మీడియా, నిర్మాతలు – హరిత గోగినేని, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – ఏఆర్ అభి, సంగీతం – అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్ – ఐ. ఆండ్రూ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, పాటలు – భాస్కరభట్ల, కొరియోగ్రాఫర్ – విశాల్,
ఆర్ట్ డైరెక్టర్ – చరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విజయానంద్. కీత, పీఆర్వో – నాయుడు-ఫణి, మార్కెటింగ్ పార్ట్ నర్ – టికెట్ ఫ్యాక్టరీ, పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలే, కాస్టింగ్ డైరెక్టర్ – ఓవర్ 7 ప్రొడక్షన్స్——————————————

‘Lucky Lakshman’ Title Song unveiled by ‘Kushi’ maker Shiva Nirvana!

The Title song Celebrates Sohel Becoming a Rich kid!!

‘Lucky Lakshman’ is an out-and-out family entertainer telling the curious incidents in the life of a youngster who feels that he is unlucky although everyone around him says he is so lucky. Produced by Haritha Gogineni of Dattatreya Media, the film features Bigg Boss fame Sohel and Mokksha as the lead pair.

The title track from the movie was released today at the hands of Majili and Kushi director Shiva Nirvana. Anup Rubens is the magician behind the groovy track, which unfolds in the backdrop of a pub. Written by Bhaskarabhatla, the song is made all the more fun by Ram Miriyala’s rendition. The song revolves around the concept of the protagonist getting rich overnight, and the lyrics follow the concept.

“Fateuu maarindhe, routuu maarindhe, top to bottom styleuu maarindhe,” the lyrics say, ringing in the ‘hawa’ of the rich kid!

The film’s song teaser was released recently. “In terms of production values and technical output, there is no compromise on quality. We are confident that everyone is going to love the film,” Sohel said.

Director Abhi and Producer Haritha Gogineni are confident about their product.

Cast:

Sohel, Mokksha, Devi Prasad, Raja Ravindra, Sameer, Kadambari Kiran, Shani Salmon, Sridevi Kumar, Ameen, Anurag, Master Roshan, Master Ayaan, Master Sameer, Master Karthikeya, Jhansi, Raccha Ravi, Jabardasth Karthik, Jabardasth Geethu, Yadam Raju of ‘Royal Comedy Stars’ fame.

Crew:

Producer: Haritha Gogineni, Story – Screenplay – Dialogues – Direction: AR Abhi, Music Director: Anup Rubens, DOP: I Andrew, Editor: Prawin Pudi, Lyricist: Bhaskarabatla, Choreographer: Vishal, Executive Producer: Vijayanand Keetha, Art Director: Charan, PRO: Naidu–Phani, Publicity Designer: Dhani Aelay, Marketing Partner: Akhilesh (Ticket Factory), Casting Director: Over7 Productions

Tags

Related Articles

Back to top button
Close
Close