

ప్రముఖ హాస్యనటుడు రఘు కారుమంచి(అదుర్స్ రఘు) ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెంకట్రావ్ కారుమంచి (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావ్ గురువారం తుదిశ్వాస విడిచారు. జూన్ 10, 1947లో జన్మించిన వెంకట్రావ్ ఆర్మీ అధికారిగా సేవలదించారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన ఇంటిదగ్గరే వున్నారు. వెంకట్రావ్ మృతి పట్ల బంధుమిత్రులు, స్నేహితులు సంతాపం ప్రకటించారు.