

తిరుపతి స్థానిక బాలాజీ కాలనీ ఆర్ఆర్ గెస్ట్ హౌస్ నందు తెలుగు సినిమా హీరో మరియు నిర్మాత శ్రీ నారా రోహిత్ గారి జన్మదిన వేడుకలను జరుపుకుంటూ వారి అభిమానులు కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నారా రోహిత్ గారు నటుడిగా మంచి సినిమాలు చేయాలని అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లో చిరుకైన పాత్ర పోషించి పార్టీకి కార్యకర్తలకి అండగా ఉండి ఆదరించాలని వారు కోరారు ఈ జన్మ దిన సందర్భంగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకు శక్తిని యుక్తిని ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో విజయ సారధి, ప్రకాష్ నాయుడు, సప్తగిరి ప్రసాద్, శేషాద్రి నాయుడు, రామ్మోహన్, రాజు యాదవ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
