Events/PressmeetsMOVIE NEWS

కోడిరామకృష్ణ పుట్టినరోజు వేడుకలు లో ఫిల్మ్ అవార్డ్స్

Kodi Ramakrishna's birthday celebrations in colorful splendor

రంగరంగ వైభవంగా కోడిరామకృష్ణ పుట్టినరోజు వేడుకలు లో లెజండరీ దర్శకులు కోడిరామకృష్ణ గారు తను తీసిన సినిమాలలో సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ప్రేక్షకులు మెచ్చే సినిమాలెన్నో తీసి శతాదిక చిత్ర దర్శకునిగా జయకేతనం ఎగురవేసిన తను జీవితంలో 10 నంది అవార్డులు, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు,2012 లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డులను స్వీకరించిన కోడిరామకృష్ణ గారు

లెజండరీ దర్శకులు కోడిరామకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని భారత్ ఆర్ట్స్ అకాడమీ, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఎబిసి ఫౌండేషన్ & వాసవి ఫిల్మ్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన నిజామాబాద్ యం.యల్.ఎ బీగాల గణేష్ గుప్త, నటుడు సుమన్, గజల్ శ్రీనివాస్, సీనియర్ నటి దివ్యవాణి, నటుడు నిర్మాత, అశోక్ కుమార్, నిర్మాత వాకాడ అప్పారావు, చికోటి ప్రవీణ్ గారు , బి. ప్రవీణ్ కుమార్ లతో చాలామంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవారంగం, నాటక రంగం, సినిమా రంగం ఇలా వివిధ రంగాలలో ప్రతిభను చూపిన సుమారు 30మందికి ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ అవార్డులను ఇస్తూ అందరికీ న్యాయం చేయడం జరిగింది.
హీరో సుమన్ గారికి కోడిరామకృష్ణ జీవన సౌఫల్య పురస్కారం అవార్డుతో పాటు లెజండరీ అవార్డు ను బహుకరించడం జరిగింది. ఈ అవార్డ్స్ కార్యక్రమం అనంతరం

హీరో సుమన్ మాట్లాడుతూ.. నాకు లైఫ్ ఇచ్చింది కోడి రామకృష్ణ గారే ఈ రోజు తనపేరుతో జీవన సౌఫల్య పురస్కారం అవార్డును అందుకోవడం సువర్ణ అవకాశంగా భావిస్తున్నాను అని అన్నారు

నిజామాబాద్ యం.యల్.ఎ బీగాల గణేష్ గుప్త మాట్లాడుతూ.. మనిషి బతికున్నప్పుడు అందరూ దగ్గరుంటారు అయితే అయన లేకున్నా ఆయనతో ఏవిధమైన సహాయ సహకారాలు అందుకోక పోయినా ఆయన తీపి గుర్తులు ప్రేక్షకులకు తెలియ జేయాలనీ అతని పేరు మీద కోడిరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ చేయడం రామ సత్యనారాయణ గ్రేట్ అని అన్నారు

నటుడు నిర్మాత, అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నేను చెవిలో పువ్వు సినిమా కు నిర్మాతగా వున్నపుడు కోడిరామకృష్ణ గారిని కలవడం జరిగింది. అప్పుడు తను నాకు భారత్ బంద్ సినిమాలో మంచి వేషం ఇస్తాను చెయ్యమని చెప్పాడు. నేను చేయలేను నాకు భయం అన్నా వినకుండా నాతో చేయించడంతో నేను నటుడుగా పరిచయమవ్వడం జరిగింది. మహా దర్శకులైన కోడిరామకృష్ణ గారు ఎందరో ఆర్టిస్టులను తీర్చి దిద్దారు. యం. యస్. రెడ్డి, అంకుశం సినిమాలో రామిరెడ్డి, క్యాస్టూమ్ కృష్ణ వీరంతా నటులు కాదు వీరంతా వేరే ప్రొఫెషన్స్ లో ఉన్నా కూడా వారిని నటులుగా బిజీ చేసిన వ్యక్తి కోడిరామకృష్ణ గారు . అటువంటి మహానుభావుడి వల్లే నేను భారత్ బంద్ తరువాత నటుడుగా బిజీ అవ్వడం జరిగింది. అంటే ఒక మనిషి లైఫ్ ను కెరియర్ ను ఎలా టర్న్ చెయ్యచ్చో తెలిసిన వ్యక్తి కోడిరామకృష్ణ గారు. ఆయన్ను ఇంకా గుర్తించుకొని మా రామ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించి నందుకు ఆయనకు మరొక్కసారి అభినందనలు తెలుపుతున్నాను. మనిషి ఉన్నా లేకున్నా స్నేహం చిరకాలం ఉంటుంది అని గుర్తు చేసిన వ్యక్తి రామ సత్యనారాయణ గారు అని అన్నారు.

సీనియర్ నటి దివ్యవాణి మాట్లాడుతూ.. కోడిరామకృష్ణ గారు ఎంతమందికి ఎన్ని సహాయాలు చేశాడు.సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడో మనందరికీ తెలుసు. ఒక శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ఐదు సినిమాలు సూపర్ హిట్ లు, యం. యస్. రాజు గారికి నాలుగు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు .ఇంతమందికి ఇన్ని హిట్స్ ఇచ్చినరు. చిన్న నాటి మిత్రుడిగా రామ సత్యనారాయణ ఈ కార్యక్రమం చేయడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను అని చెప్పారు.

నటుడు నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. కోడిరామకృష్ణ గారికి నేనంటే ఎంతో ఇష్టం. తనకు సినిమా అంటే ఎంత ప్రేమో.. నాటకాలు, నాటికలు అన్నా అంతే ప్రేముండేది. ఈ రోజు తన పేరుతో ఈ అవార్డ్స్ ఫంక్షన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ అవార్డ్స్ అన్ని రంగాలలో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి అందజేయడం జరిగింది అన్నారు.

తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, కొత్త వెంకటేశ్వర్ రావు, బి. రమణారావు లు నిర్వహించిన కోడిరామకృష్ణ అవార్డ్స్ కార్యక్రమానికి వచ్చిన అనేకమంది పాల్గొని కోడిరామకృష్ణ స్మృతులను గుర్తుకు చేసుకున్నారు

Tags

Related Articles

Back to top button
Close
Close