MOVIE NEWS

మెగాస్టార్ చిరంజీవి గారి సమర్పణలో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ‘లాల్ సింగ్ చెడ్డా’ నుంచి నాగ చైతన్య లుక్ విడుదల

Naga Chaitanya look released from 'Lal Singh Cheddha' presented by Geetha Arts Distribution presented by Megastar Chiranjeevi

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లాల్ సింగ్ చెడ్డా. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే బాలీవుడ్ లో విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం గమనార్హం. ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈయన ఫస్ట్ లుక్ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఇందులో బాలరాజు పాత్రలో నటిస్తున్నారు చైతన్య. అమీర్ ఖాన్ తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు అక్కినేని హీరో. ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ దర్శకుడు సుకుమార్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి, కింగ్ నాగార్జున, నాగ చైతన్య కలిసి చూశారు. షో అయిపోయిన తర్వాత అమీర్ ఖాన్ పెర్ఫార్మన్స్ గురించి.. చైతన్య పాత్ర గురించి బాగా ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్. సినిమా ఖచ్చితంగా అద్భుతమైన విజయం సాధిస్తుందని.. తెలుగులో కూడా ప్రేక్షకుల మన్ననులు అందుకుంటున్న అని తెలిపారు చిరంజీవి. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

న‌టీన‌టులు – ఆమిర్ ఖాన్, క‌రీనా కుమార్, నాగ చైత‌న్య త‌దిత‌రులు
స‌మ‌ర్ప‌ణ – మెగాస్టార్ చిరంజీవి
బ్యాన‌ర్లు – వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్
నిర్మాత‌లు – ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే
సంగీతం – ప్రీతిమ్
భార‌తీయ చిత్రానుక‌ర‌ణ – అతుల్ కుల్ క‌ర్ణి
ద‌ర్శ‌క‌త్వం – అద్వైత్ చంద‌న్

Tags

Related Articles

Back to top button
Close
Close