MOVIE NEWS

యంగ్ హీరో నిఖిల్, చందూ మొండేటి ‘కార్తికేయ 2’ చిత్ర యూనిట్‌కు అరుదైన గౌరవం.. ఇస్కాన్ మెయిన్ సంస్థానం ‘బృందావన్‌’కు ప్రత్యేక ఆహ్వానం..

Karthikeya 2 Team Gets Special Invitation!

వరస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్, విలక్షణ దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న కార్తికేయ 2 సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రానికి తాజాగా అరుదైన ఆహ్వానం లభించింది. కార్తికేయ 2 చిత్రం శ్రీ కృష్ణుడి తత్వం, ఆయన బోధించిన ఫిలాసఫీ ఆధారంగా వస్తుందని.. టీజర్, మోషన్ పోస్టర్‌ను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా కార్తికేయ 2 చిత్రయూనిట్‌కు ఇస్కాన్ అత్యున్నత సంస్థానం బృందావన్‌కు రావాలంటూ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ గారి నుంచి ఆహ్వానం లభించింది. ఇస్కాన్ దేవాలయాలు కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. దేశదేశాల్లో.. ఖండఖండాంతరాలుగా వ్యాపించి ఉన్నాయి. ఆస్ట్రియా లాంటి దేశాల నుంచి మొదలుపెట్టి ఎన్నో వందల దేశాల్లో ఇస్కాన్ టెంపుల్స్ కొలువై ఉన్నాయి. అంతటి ప్రగ్యాతి గాంచిన ట్రస్ట్ నుంచి కార్తికేయ 2 టీమ్‌కు ఆహ్వానం లభించడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఇప్పటి వరకు ఇతిహాసాల నేపథ్యంలో, మైథలాజికల్ స్టోరీస్‌ నేపథ్యంలో ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. భారతం, భాగవతం, రామాయణాలపై సినిమాలతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సీరియల్స్ రూపొందాయి. అయితే భారతీయ సినీ చరిత్రలో ఎవరికీ దక్కని గౌరవం కార్తికేయ 2 టీంను వరించింది. బృందావన్‌కు ఆహ్వానం అనేది చిన్న విషయం కాదు. శ్రీ కృష్ణుడి తత్వం, ఫిలాసఫీ, ఆయన ఆరా భరతఖండంపై ఎలా ఉంది.. ాయన బోధించిన సారాంశం ఏంటి అనేది కోర్ పాయింట్‌గా కార్తికేయ 2 సినిమా ఉండబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.
Karthikeya 2 Team Gets Special Invitation!
Karthikeya 2 team has achieved a rare honour that no movie to date in the Indian film industry got. International Society For Krishna Consciousness(ISKCON) Vice President and spokesperson Radharam Das has invited the movie team to the headquarters of the organization. It is in Brindavan, Madhura.. a place where Lord Krishna was born and is said to be still doing the eternal dances with his devotees from Dwaparyuga. The hero of Karthikeya 2, Nikhil Siddartha has announced this on Twitter.The film is clearly based on the ideology and spirituality of Lord Sri Krishna which was evident in the teaser. After seeing them, Radharam Das is said to be impressed and wished to talk with him. In the decades of Indian film and TV industry’s history, there were a lot of movies in the spirituality genre. The telefilms like Ramayana and Mahabharat have spell bounded crores of people. But, it’s the Karthikeya-2 team which got the first opportunity and honour which was never witnessed by any of those movies or shows. In fact, this is the first in the entire Indian film industry for a movie team to be invited by ISKCON.ISKCON is an organization which is spread all over the world and has temples which are visited by crores of pilgrims and people of different faiths. It’s noteworthy that Apple founder Steve Jobs used to eat in ISKCON when he was financially unstable. The spiritual organization embraces one and all. The impact of Lord Sri Krishna’s philosophy, his aura, his divinity, and his power on India is the core point of Karthikeya 2 which must have attracted the spirituals at ISKCON. One must say, it’s a proud moment for the Telugu Film Industry too.

Tags

Related Articles

Back to top button
Close
Close