MOVIE NEWS

Mesmerizing Class Number Kaanunna Kalyanam From Sita Ramam Unleashed

Mesmerizing Class Number Kaanunna Kalyanam From Sita Ramam Unleashed

The film Sita Ramam starring Dulquer Salmaan and Mrunal Thakur is hiking prospects with its intriguing promotional content. Particularly, songs have got remarkable response. Here comes another soothing number from the movie. Lyrical video of third single Kaanunna Kalyanam has been unleashed.

It’s a mesmerizing class number that will connect instantly. Vishal Chandrashekhar is in top-form and the song hits you right away. It gives soothing and soulful vibes on the first listening. Anurag Kulkarni and Sinduri S make this even more special as they croon the lyrics in a spectacular manner. Legend Sirivennela Sitarama Sastry has penned some touching lyrics that are rich in Telugu flavour. Dulquer and Mrunal’s jodi look stunning on screen with beautiful locations in the background.

While Rashmika Mandanna’s presence in the most-awaited film Sita Ramam was a big surprise, the makers of this Dulquer Salman and Mrunal Thakur revealed another big surprise. Hero Sumanth is playing a crucial role as Brigadier Vishnu Sharma in this Hanu Raghavapudi directorial venture and his first look poster has been unveiled.

Aswini Dutt is producing the movie under Swapna Cinema. Vishal Chandrashekhar has provided music for this classic romantic saga.

Tollywood’s prestigious production house Vyjayanthi Movies presents this highly anticipated movie that has cinematography by PS Vinod. The film being made simultaneously in Telugu, Tamil and Malayalam languages is slated for release on August 5th.

Cast: Dulquer Salmaan, Mrunal Thakur, Rashmika Mandanna, Sumanth, Gautam Menon, Tharun Bhascker, Prakash Raj and others.

Technical Crew:
Director: Hanu Raghavapudi
Producers: Ashwini Dutt
Banner: Swapna Cinema
Presents: Vyjayanthi Movies
Ex-Producer: Geetha Goutham
DOP: PS Vinod
Music Director: Vishal Chandrasekhar
Editor: Kotagiri Venkateswara Rao
Production Design: Sunil Babu
Art Director: Vaishnavi Reddy,Ali thots
Costume Designer: Sheetal Sharma
PRO: Vamsi-Shekar

‘సీతారామం’ నుండి మెస్మరైజింగ్ క్లాస్ నంబర్ ‘కానున్న కళ్యాణం’ విడుదల

Song-Out-Now-Post

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన ‘సీతారామం’ చిత్రం ఆసక్తికరమైన ప్రొమోషనల్ కంటెంట్‌తో భారీ అంచనాలు పెంచుతోంది. ముఖ్యంగా పాటలకు విశేషమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి థర్డ్ సింగిల్ ‘కానున్న కళ్యాణం’ పాట లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ పాట మెస్మరైజింగ్ క్లాస్ నంబర్ గా విన్న వింటనే ఆకట్టుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాట మనసుని హత్తుకుంది. అనురాగ్ కులకర్ణి, సిందూరి ఈ పాటని ఆలపించిన విధానం అద్భుతంగా వుంది. లెజండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటకు అందించిన సాహిత్యం పదికాలాలు గుర్తుపెట్టుకునేలా వుంది

♪♪కానున్న కళ్యాణం ఏమన్నది ?
స్వయంవరం మనోహరం
రానున్న వైభోగం ఎటువంటిది ?
ప్రతి క్షణం మరో వరం
విడువని ముడి ఇది కదా
ముగింపు లేని గాధగా
తరముల పాటుగా తరగని పాటగా
ప్రతి జత సాక్షిగా ప్రణయమునేలగా సదా.. ♪♪

పాట పల్లవిలో వినిపించిన ఈ సాహిత్యం మనసుకి గొప్ప హాయిని నింపేలా అనిపించాయి. అద్భుతమైన లోకేషన్స్ చిత్రీకరించిన ఈ పాట చాలా ఆహ్లాదకరంగా వుంది. ముఖ్యంగా దుల్కర్, మృణాల్ మ్యజికల్ గా కనిపిస్తుంది.

ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న  కీలక పాత్రలో సర్ప్రైజ్ చేయనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా హీరో సుమంత్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంది.

స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దృశ్య కావ్యంగా తెరకెక్కుతున్న ‘సీతారామం’కు  విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి  పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు.

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న  ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్,  తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్ తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాత: అశ్వినీదత్
బ్యానర్: స్వప్న సినిమా
సమర్పణ: వైజయంతీ మూవీస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గీతా గౌతమ్
ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు
ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి, అలీ
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
పీఆర్వో : వంశీ-శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close