MOVIE NEWS

రూపేష్ పోలీస్ డ్రెస్ లో చాలా బాగున్నాడు, డైరెక్టర్ గా శివ‌కు 22 సినిమా బిగ్ హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నా – యంగ్‌ రెబల్ స్టార్ ప్ర‌భాస్.

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్‌ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ’22’. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఇటీవ‌ల డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ చేతుల‌మీదుగా విడుద‌లైన ఫస్ట్‌లుక్‌, కింగ్ నాగార్జున విడుద‌ల‌చేసిన టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్ వ‌స్తోంది. తాజాగా ఈ చిత్రం నుండి మార్ మార్ కె జీనా హై..బార్ బార్ యహ మర్నాహై.. లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను 22-02-2020న ఉద‌యం 8:59 నిమిషాలకు యంగ్‌ రెబల్ స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు. అనంత‌రం..

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ మాట్లాడుతూ – ఇప్పుడే `22` మూవీ లిరికల్ వీడియో సాంగ్ చూశాను. వెరీ నైస్.. చాలా బాగుంది. శివకు దర్శకుడిగా మొదటి సినిమా. బిఎ రాజు గారు, జయ గారు ఎప్పటినుంచో మాకు తెలుసు. రూపేష్ పోలీస్ డ్రెస్ లో చాలా బాగున్నాడు. సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ` 22` క‌చ్చితంగా ఒక డిఫ‌రెంట్ మూవీ అవుతుంది. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. ప్లీజ్ స‌పోర్ట్ ది ఫిల్మ్‌ అన్నారు.

ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ దసపల్లా హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

హీరో రూపేష్‌కుమార్ చౌద‌రి మాట్లాడుతూ – `ఈ రోజు నా ఫ‌స్ట్ మూవీ ఫ‌స్ట్ సాంగ్‌ను ప్ర‌భాస్‌గారు లాంచ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవ‌డానికి నా ద‌గ్గ‌ర మాట‌ల్లేవు. ప్ర‌భాస్‌గారిలాంటి పెద్ద స్టార్ న‌న్ను ఎంక‌రేజ్ చేస్తూ పోలీస్ డ్రెస్‌లో చాలా బాగున్నావ‌ని అన‌డం ఒక అవార్డులా భావిస్తున్నాను. మంచి లిరిక్స్‌రాసిని కాస‌ర్ల‌శ్యామ్‌గారికి, మంచి సంగీతం అందించిన సాయికార్తీక్ గారికి థ్యాంక్స్‌. కార్తీక్‌గారు సినిమాకి మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చి మ‌మ్మ‌ల్ని ప్రొత్స‌హించారు. ఈ అవ‌కాశం ఇచ్చిన శివ‌గారికి ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు శివ‌కుమార్. బి మాట్లాడుతూ – 22-02-2020 రోజున మా 22 మూవీ ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియోను ప్ర‌భాస్‌గారు విడుద‌ల చేయ‌డం సంతోషంగా ఉంది. ప్ర‌భాస్‌గారి గురించి చెప్పాలంటే...డిక్ష‌న‌రీలో ల‌వ్, డార్లింగ్ అనే ప‌దాల‌ను తీసేసి ప్ర‌భాస్ అనే ఒక్క‌ ప‌దం పెడితే స‌రిపోతుందెమో. అంత మంచి ప‌ర్స‌నాలిటీ. ప్ర‌భాస్‌గారు ఈ సాంగ్ లాంచ్ చేస్తున్నారు అన‌గానే చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. సాంగ్ లాంచ్ చేసి, సినిమా కాన్సెప్ట్ గురించి అడిగి తెలుసుకుని, క‌థ‌లో మంచి డెప్త్ ఉంది. ఈ సినిమాను బాగా ప్ర‌మోట్ చేయండి, త‌ప్ప‌కుండా బిగ్ హిట్ అవుతుంది అని చెప్పి మా టీమ్ అంద‌ర్నీ విష్ చేశారు. ప్ర‌భాస్‌గారికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ఇక సాంగ్ గురించి చెప్పాలంటే...సాయికార్తీక్, నేను ఈ పాట ఎవ‌రు రాస్తే బాగుంటుంది అని అనుకున్న‌ప్పుడు మా అమ్మ‌గారు ప‌రిచ‌యం చేసిన శ్యామ్ అయితే బాగుంటుంద‌నిపించి ఇలా ప్లాన్ చేశాం. నిజానికి ఇది ప్లాన్ కాదు. డెస్టినీ అనిపిస్తోంది. సాంగ్ కొత్త‌గా ఉండాల‌ని నేను, సాయి, శ్యామ్ అనుకోని హిందీ లిరిక్స్‌ను మిక్స్ చేశాం.

మ‌రి..సింగ‌ర్ ఎవ‌రు అని అడ‌గ‌గానే..సాయికార్తీక్ నేను పాడించి చూపిస్తాను అని చెప్పారు. నేను పాట విన‌గానే..ఈ పాట పాడింది మ్యాడీయేనా అనుకున్నాను. అంత గొప్ప‌గా పాడారు. ఆ త‌ర్వాత టీజ‌ర్‌లో ఏదైతే న‌వ్వు వ‌స్తుందో దాని గురించి చాలా మంది అడిగారు. ఆ గొంతు మ్యాడీదే. దాని వ‌ల్ల సినిమాకు మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. `22` సినిమా ఇంత బాగా రావ‌డానికి కార‌ణమైన‌ హీరో రూపేష్‌గారికి థ్యాంక్స్‌. ర‌వికిర‌ణ్, పెద్దిరాజు బాగా స‌పోర్ట్ చేశారు. నాకు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసే అవ‌కాశం ఇచ్చి ద‌ర్శ‌క‌త్వంలో మెళుకువలు నేర్పించిన ద‌ర్శ‌కులు పూరీ జగన్నాథ్, వి.వి.వినాయ‌క్‌, మారుతి గార్ల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు అన్నారు.

చిత్ర నిర్మాత శ్రీమ‌తి సుశీలాదేవీ మాట్లాడుతూ –ఈ సినిమా టాకీపార్ట్‌ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు సాయికార్తీక్ మాట్లాడుతూ – “మా సాంగ్ లాంచ్ చేసిన ప్ర‌భాస్‌గారికి, ఈ సినిమాను ఆయ‌న వ‌ర‌కు తీసుకువెళ్లిన మా బాబాయి బి.ఎ.రాజుగారికి ధ‌న్య‌వాదా…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close